ప్రముఖ సినీ దర్శకుడు మృతి

First Published Dec 14, 2017, 11:44 AM IST
Highlights
  • ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నీరజ్ వోరా మృతి
  • గుండెపోటుతో తుది శ్వాస విడిచిన నీరజ్ వోరా
  • గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న నీరజ్ వోరరా

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు, రచయిత నీరజ్ వోరా మరణించారు. 54 సంవత్సరాల నీరజ్ వోరా ముంబై, అంధేరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచారు.

 

నీరజ్ వోరా అక్టోబర్ 2016న హార్ట్ ఎటాక్ తో పాటు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. గత పదమూడు నెలలుగా ఆయన కోమాలోనే ఉన్నారు. ఆ తర్వాత అతడిని తన స్నేహితుడు, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా ఇంటికి మార్చారు.

 

అతడు స్పీడ్ గా రికవరీ అయ్యేందుకు నడియావాలా ఇంట్లోనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసియు) ఏర్పాటు చేశారు. నీరజ్ వోరా ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన్ని మళ్లీ ఆసుపత్రికి తరలించగా.... చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు.

 

ఖిలాడి 420, ఫిర్ హెరా పేరీ, ఫ్యామిలీవాలా, షార్ట్ క ట్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు దౌడ్, హెరా పేరీ, యే తేరా ఘర్ యే మేరా ఘర్, గోల్ మాల్ చిత్రాలకు రచయితగా పని చేశారు. దాదాపు 25 చిత్రాల్లో నటించారు.

హెరా ఫెరి చిత్రానకి గాను ఆయన బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైలాగ్స్ కేటగిరీలో అవార్డులు అందుకున్నారు. దీంతో పాటు లయన్ గోల్డ్ అవార్డు, పెరల్స్ రత్నా అవార్డ్ అందుకున్నారు.

click me!