రాజ్‌ కౌశల్‌ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాంః మందిరా బేడీ భర్త మరణంపై ప్రముఖుల సంతాపం

Published : Jun 30, 2021, 03:17 PM IST
రాజ్‌ కౌశల్‌ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాంః మందిరా బేడీ భర్త మరణంపై ప్రముఖుల సంతాపం

సారాంశం

మందిరా బేడీ భర్త రాజ్‌ కౌశల్‌ మరణంపై సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. `మై బ్రదర్‌` చిత్ర దర్శకుడు ఓనిర్‌ సంతాపం వ్యక్తం చేశారు. చాలా త్వరగా వెళ్లిపోయాడంటూ ఎమోషనల్‌ అయ్యారు. 

బాలీవుడ్‌ నటి మందిరా బేడి భర్త, దర్శక, నిర్మాత రాజ్‌ కౌశల్‌ హఠాన్మరణం బాలీవుడ్‌ని దిగ్భ్రాంతికి గురి చేసింది. హిందీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ ఆయన స్నేహితుడు,   `మై బ్రదర్‌` చిత్ర దర్శకుడు ఓనిర్‌ సంతాపం వ్యక్తం చేశారు. చాలా త్వరగా వెళ్లిపోయాడంటూ ఎమోషనల్‌ అయ్యారు. 

`చాలా త్వరగా వెళ్లిపోయారు. నిర్మాత రాజ్‌ కౌశల్‌ని కోల్పోయాం. నా మొదటి చిత్ర నిర్మాత. మా దృష్టిని నమ్ముకుని మాకు అన్ని వేళలో సపోర్ట్ గా నిలిచిన వారిలో ఒకరు. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్తిస్తున్నా` అని ట్వీట్‌ చేశారు. 

నటి నేహా దూపియా స్పందిస్తూ, ఆయనతో దిగిన ఫోటోని పంచుకుంది. `రాజ్‌, మీతో అనేక జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఈ చిత్రాన్ని తీశాం. మీరు లేరనే వార్తలను నమ్మలేకపోతున్నాం` అంటూ మందిరాకి ధైర్యం చేకూరని వెల్లడించారు. 

టిస్కా చోప్రా స్పందిస్తూ `రాజ్‌ కౌశల్‌ మాతో లేరనే విషయాన్ని ఊహించలేకపోతున్నాం. చాలా షాకింగ్‌గా ఉంది. నా హృదయం మందిరా బేడి, వారి పిల్లల వైపు లాగుతోంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాజ్‌ సున్నితమైన ఆత్మ మిస్‌ అయ్యింది` అని ట్వీట్‌ చేసింది. మరికొందరు బాలీవుడ్‌ ప్రముఖులు స్పందిస్తూ రాజ్‌ కౌశల్‌ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్‌ కౌశల్‌ దర్శకుడిగా `ప్యార్‌ మెయిన్‌ కభీ కభీ`,`షాది కా లడూండ్‌ అంథోని కౌన్‌ హై` చిత్రాలను రూపొందించారు. అలాగే నిర్మాతగా `మై బ్రదర్‌` లాంటి పలు చిత్రాలను నిర్మించారు. మందిరా, రాజ్‌ కౌశల్‌ 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో కుమారుడు వీర్‌ జన్మించారు. అలాగే ఓ కుమార్తెని దత్తత తీసుకున్నారు. మందిరా బేడీ ప్రభాస్‌ `సాహో` చిత్రంలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?