ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో చాలా వరకు పరభాషా నటులుంటున్నారు. ఇప్పుడు చిరంజీవి నటించబోతున్న చిత్రంలో బాలీవుడ్ నటుడిని తెలుగు తెరకి పరిచయం చేయబోతున్నారు.
తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియాగా మారిపోయింది. పెద్ద హీరోల సినిమాలు చాలా వరకు పాన్ ఇండియాలెవల్‌లో విడులవుతున్నాయి. తెలుగులోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మార్కెట్ విస్తరించిన దృశ్యా ఇతర భాషల్లో హైప్ తీసుకురావడానికి ఇతర భాషా నటులను తీసుకుంటున్నారు. దీంతో ఆయా భాషల్లో కలెక్షన్ల విషయంలో అది కొంత వరకు ప్రభావం చూపే అవకాశాలుంటున్నాయి.
ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో చాలా వరకు పరభాషా నటులుంటున్నారు. ఇప్పుడు చిరంజీవి నటించబోతున్న చిత్రంలో బాలీవుడ్ నటుడిని తెలుగు తెరకి పరిచయం చేయబోతున్నారు. హిందీ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని చిరంజీవి సినిమాలో కీలక పాత్ర కోసం తీసుకునే ఆలోచనలో ఉన్నారట. చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత `లూసీఫర్` రీమేక్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఇది మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు.
దీంతోపాటు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో ఓ సినిమా, బాబీ డైరెక్షన్ మరో సినిమాకి కమిట్ అయ్యాడు చిరు. బాబీ సినిమాలో కీలక పాత్ర కోసం నవాజుద్దీన్‌ని కలవగా, ఆయన సుముఖత వ్యక్తం చేశారని, తన పాత్ర నరేషన్ ఇవ్వమని చెప్పారని టాక్. ఆయన చిరంజీవి సినిమాలో నటించేందుకు చాలా ఆసక్తిని చూపించారని ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. బాబీ ఈ సినిమా స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. త్వరలోనే నవాజుద్దీనికి నెరేషన్ ఇచ్చే అవకాశాలున్నాయట. చిరంజీవి మాత్రం వరుసగా కమిట్ అయిన చిత్రాలను జెట్ స్పీడ్‌లో పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఇప్పుడు నటిస్తున్న `ఆచార్య` చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ హీరోయిన్. చెర్రీ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్‌ని త్వరలోనే పూర్తి చేసి రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు నవాజుద్దీన్ బాలీవుడ్ విలక్షణ నటుల్లో ఒకరు. `మ్యాంటో` ఆయన నటనకు ప్రతిరూపంగా నిలుస్తుంది. అంతేకాదు ఆయన కమర్షియల్ చిత్రాలతోపాటు కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు, సమాంతర చిత్రాల్లోనూ నటిస్తుంటారు. ఆయన చిత్రాలు చాలా వరకు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సత్తాచాటుతుండటం విశేషం. ప్రస్తుతం ఆయన హిందీలో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు.