అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయ్యి.. ఏడ్చిన తమన్నా, వైరల్ అవుతున్న వీడియో

Published : Jun 27, 2023, 12:40 PM IST
అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయ్యి.. ఏడ్చిన తమన్నా,  వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

హీరోయిన్ తమన్నా ఎమోషనల్ అయ్యింది.. ఏడ్చేసింది. ఓ అభిమాని చేసిన పనికి.. తట్టుకోలేకపోయింది బ్యూటీ. ఇంతకీ తమ్ము బేబీ ఏడ్చేలా.. ఆ అభిమాని ఏం చేశారు.   

ఈ మధ్య అభిమానం పేరుతో.. చిత్ర విచిత్రాలు చేస్తున్నారు జనాలు.  అభిమానం ఉంటే... ఉండొచ్చుకాని.. పర్సనల్ లైఫ్ లో కూడా ఆ అభిమానం తాలూకు జ్ఞాపకాలు ఉండేలా ప్లాన్ చేసుకోవడం చిత్రంగా ఉంటుంది. అన్ని వేల మంది, లేద లక్షల .. కోట్ల మంది అభిమానులున్న తారలకు వీరు గుర్తుంటారా..? గుర్తుపెట్టుకునే తీరిక వాళ్ళకు ఎక్కడ ఉంటుంది. వాళ్లు కూడా ఏం చేయలేస్తారు.. అభిమానులంతా మా ప్రాణం అంటారు కాని.. ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకోలేవరు కదా..? కాని కొంత మంది అభిమానులు మాత్రం చిత్ర విచిత్రపు ఆలోచనలు మాత్రం మానరు. తాజాగా ఓ అభిమాని తమన్నా కోసం చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 

తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా ఇంకా వరుసగా సినిమాలు చేస్తుంది. సౌత్ లో ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరితో కలిసి నటించిన తమన్నా ఇప్పుడు కూడా సౌత్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఇన్నాళ్లయినా ఇప్పటికి కూడా తమన్నా చేతిలో దాదాపు అరడజను మూవీస్ పైగా ఉన్నాయి. ఇదేమి మాములు విషయం కాదు కదా..?  సినిమాలే కాకుండా.. వెబ్ సిరీస్ లు, యాడ్స్ తో కూడా ఫుల్ బిజీగా మారింది. రీసెంట్ గా జీ  కర్దా సిరీస్ లో రెచ్చిపోయి బోల్డ్ గా నటించింది. ఇక తమన్నా నటించిన బోల్డ్ మూవీ లస్ట్ స్టోరీస్ జూన్ 29న రిలీజ్ కు రెడీగా ఉంది. 

మిల్క్ బ్యూటీ తమన్నాకి దేశ వ్యాప్తంగా  అభిమానులు ఎక్కువగా ఉన్నాయి.  సోషల్ మీడియాలో  ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది తమన్నా. అటు నెట్టింట్లో కూడా ఫాలోవర్స్ భారీగా పెంచుకుంటుంది. ముఖ్యంగా సౌత్ లో  తమన్నాకి సౌత్ తో పాటు  బాలీవుడ్ లో రెండు చోట్ల అభిమానులు భారీగానే ఉన్నారు. తాజాగా ఓ అభిమాని తమన్నాకి షాక్ ఇచ్చింది. తమన్నాను కలిసి తన అభిమానాన్ని చాటుకుంది. ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

 

ఇంతకీ ఆ అభిమాని ఏం చేసిందంటే..?  తమన్నా తాజాగా ముంబైలో ఓ మాల్ కి వెళ్లింది. పని ముగించుకోని  పార్కింగ్ ప్లేస్ లోకి వెళ్లగా.. ఆమెతో ఫోటోల కోసం అభిమానులు ఎగబడ్డారు. సరిగ్గా అదే టైమ్ లో ఓ అభిమాని వచ్చి.. తన చేతిపై ఉన్న తమన్నా ఫోటో టాట్యూను చూపించాడు. ఆ వ్యక్తి తన చేతిపై తమన్నా ఫేస్ ని టాటూగా వేయించుకున్నాడు, దాంతో పాటు లవ్ యు తమన్నా అని కూడా రాసుకున్నాడు. దీంతో ఆ టాటూ చూసి తమన్నా ఎమోషనల్ అయింది.  ఆ అభిమాని తమన్నా కాళ్ళకి నమస్కారం పెట్టడంతో అతన్ని దగ్గరకు తీసుకొని హత్తుకుంని ఏడ్చేసింది. 

అంతే కాదు ఈ పరిణామానికి ఏం చేయాలో తెలియని తమన్నా... ఎమోషనల్ అయి అతనికి చాలా సార్లు థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ వీడియో ను తమ్ము ఫ్యాన్స్ ఎక్కువగా వైరల్ చేస్తున్నారు. శేర్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు