అయోధ్య రామమందిరంలో సందడి చేశారు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్. అమితాబ్ దర్శణానికి వచ్చారనితెలిసి భారీ ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు.
బాలీవుడ్ బిగ్ బీ.. అమితాబ్ బచ్చన్ అయోధ్యలో సందడి చేశారు. అయోధ్యలోని శ్రీ బాలరాముడి మందిరాన్ని మరోసారి సందర్శించారు. శుక్రవారం ముంబై నుంచి అయోధ్య కు వెళ్లిన బిగ్‌బీ.. బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అమితాబ్ బచ్చన్ రాకతో ఆలయ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ భారీబద్రత మధ్య బిగ్‌బీ ఆలయం నుంచి బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
నెలరోజులు గడవకముందే.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడం ఇది రెండో సారి. గత నెల 22న అత్యంత ఘనంగా జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి.. ఆహ్వానం అందగా.. బాలీవుడ్ నుంచి హాజరయ్యారు అమితాబచ్చన్. బిగ్‌బీతోపాటు అన్ని భాషల నుంచి సినిమా తారలు ఈ వేడుకలక హాజరయ్యారు. సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హాజరై శ్రీరాముడిని దర్శించుకున్నారు.
VIDEO | Actor Amitabh Bachchan () visits Ayodhya's Ram Mandir to offer prayers.
(Source: Third Party) pic.twitter.com/Q3V3uI6m7k
ఇక అప్పుడు ఇప్పుడు ఆయన బాలరాముడి దర్శనానికి సంబంధించిన ఫొటోలను బిగ్‌బీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బిగ్ బీ తెలుగుతో పాటు పలు సౌత్ సినిమాల్లో నటిస్తునర్నారు. ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న కల్కీ సినిమాలో నటిస్తున్నారు బిగ్ బీ. దీనితో పాటు తమిళ సినిమాలో కూడా బిగ్ బీ రజినీకాంత్ సినిమాలో నటిస్తున్నారు.