గోడలు దూకి ఆపని చేసేవాళ్లం.. కాలేజీ రోజులు గుర్తుచేసుకున్న అమితాబ్

By Mahesh JujjuriFirst Published Jan 3, 2024, 11:39 AM IST
Highlights

తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. కాలేజ్ లో చేసిన అల్లరి పనులు, గోడలు దూకినసందర్భాల గురించి వివరించారు. ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే..? 

81 ఏళ్ల వయస్సులో కూడా చాలా హుషారుగా ఉన్నాడు  బిగ్ బీ  అమితాబ్ బచ్చన్. వరుస షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నాడు. ఒక వైపు సినిమాలు, మరోవైపు టీవీషోలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. యంగ్ స్టార్స్ కు ఆదర్శంగా నిలుస్తున్నాడు బిగ్ బీ. ఈమధ్య వరకూ ఆయన  కౌన్ బనేగా కరోడ్ పతీ సీజన్ 15ను  సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఈ వయస్సులో కూడా తన హోస్టింగ్ తో అద్భుతం చేశారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఇక అమితాబ్ తాజాగా తన కాలేజ్ రోజులను గుర్తు చేసుకున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతీ తాజా ఎపిసోడ్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

ఢిల్లీలో తాను చదువుకున్న రోజులను నెమరు వేసుకున్నారు బిగ్ బీ అమితాబ్. అయితే తాజా ఎపిసోడ్ లో ఆ కాలేజీలో చదివిన ఓలేడీ పాల్గొన్నారు.  తాను చదివిన కిరోరీ మల్ కాలేజీలోనే షో కంటెస్టెంట్ కూడా చదవడంతో బిగ్ బీ నాటి జ్ఞాపకాల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. అప్పట్లో తాను కాలేజీలోచేసిన అల్లరి గురించి వివరించారు. 

Latest Videos

 

అప్పట్లో నేను హాస్టల్‌లో ఉండి చదువుకునే వాణ్ణి. అయితే ఆహాస్టల్ తో పాటు తాను ఉండే గది కూడా ఓ  మూలన ఉండేది. గదిలోంచి చూస్తే ప్రహరీ గోడ కనిపించేది. కాలేజ్ సెక్యూరిటీని దాటుకుని.. తాము సినిమాలు చూసేందుకు మేము గోడ దూకి వెళ్లేవాళ్లం. మళ్ళీ ఎవరికీ తెలియకుండా గోడదూకి  కాలేజ్ హాస్టల్ లోకి వచ్చేవారం అన్నారు.  ఒక రకంగా చెప్పాలంటే.. కాలేజీలో నేను చదివిన రోజులన్నీ నిరుపయోగమైనట్టే అన్నారు. 

అంతే కాదు  అప్పట్లో నేనేమీ సాధించింది లేదు అని ఉన్నది ఉన్నట్టు చెప్పుకున్నారు అమితాబ్. తన బీఎస్‌సీ డిగ్రీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. అప్పట్లో తాను చదువుకుని కూడా లైఫ్ లో ఫెయిల్ అయినట్టు ఫీల్ అయ్యానన్నారు. తన కాలేజీ రోజుల్లో  అనుభూతులను  బిగ్ బీ చెప్పుకొచ్చారు. అలహబాద్‌లోని బాయ్ హైస్కూల్లో తాను చదువుకున్నానని, 1962లో డిగ్రీ పూర్తి చేశానని బిగ్‌బీ తెలిపారు.

click me!