‘ఆదిపురుష్’లో నాకు అందుకే అవకాశం ఇచ్చారు.. కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Jun 11, 2023, 02:52 PM ISTUpdated : Jun 11, 2023, 02:57 PM IST
‘ఆదిపురుష్’లో నాకు అందుకే అవకాశం ఇచ్చారు..  కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సారాంశం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కు జంటగా ‘ఆదిపురుష్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్. అయితే ఈ చిత్రంలో అవకాశం ఎలా దక్కిందో తాజాగా చెప్పుకొచ్చింది.   

 

హిందూ మైథలాజికల్ చిత్రంగా రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’ కోసం ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కించడం, భారీ విజువల్స్ తో థియేటర్లలోకి రాబోతుండటంతో సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన రెండు ట్రైలర్స్  కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. మొదటి ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై నెక్ట్స్ లెవల్ అంచనాలు పెరిగింది.

మరో ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంపై యూనిట్ రోజురోజుకు మరింత హైప్ పెంచుతోంది. ఈ క్రమంలో కృతి సనన్ కూడా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ తనకు Adipurush లో అవకాశం రావడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చింది. 

కృతి సనన్ మాట్లాడుతూ.. తనకు ‘ఆదిపురుష్’లో అవకాశం రావడం అదృష్టమని చెప్పారు. అయితే గతంలో తను హైట్ ఎక్కువగా ఉండటంతో సరైన ఆఫర్లు వచ్చేవి కాదన్నారు. కానీ ఆదిపురుష్ విషయంలో తనకు మంచి జరిగిందన్నారు. ప్రభాస్ రాముడిగా నటించడం, సీతగా తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. 

రీసెంట్ గా  ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక గురు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. లక్ష మంది ప్రేక్షకులు ఈవెంట్ హాజరై విజయవంతం చేశారు. ఇక బుక్కింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మరోవైపు స్టార్స్ కూడా 10 వేల టికెట్లు కొనుగోలు చేస్తూ సినిమాను ప్రేక్షకులకు చేరవేస్తున్నారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?