బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తాజాగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ గా బదులిచ్చారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయం అయ్యారు. పాన్ ఇండియన్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన ‘ఏక్ నిరంజన్’ చిత్రంతో అలరించింది. తొలిచిత్రంతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ ను దక్కించుకుంది. ప్రభాస్ - కంగనా జంటకు అభిమానులు కూడా ఫిదా అయ్యారు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఆ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ చిత్రం ఫ్యాన్స్ కు స్పెషల్ మూవీగా నిలిచిపోయింది.
‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. దీంతో డార్లింగ్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా నార్త్ లో నూ ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఏర్పడింది. మరోవైపు కంగనా కూడా బాలీవుడ్ లో వరుస చిత్రాలతో తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఇక కంగనా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. ఈక్రమంలో తాజాగా అభిమానులతో AskKangana సెషన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపిగ్గా బదులిచ్చారు.
ఈ క్రమంలో ప్రభాస్ అభిమాని ఒకరు ప్రశ్నిస్తూ.. ‘మళ్లీ మీరు ప్రభాస్ తో నటించే ఛాన్స్ ఉందా? ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పండి’ అని అడిగారు. దీనికి కంగనా స్పందిస్తూ.. ‘ప్రభాస్ ఇంట్లో వంటకాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే ప్రభాస్ మంచి హోస్ట్ కూడా’ అంటూ బదులిచ్చింది. కానీ ప్రభాస్ తో నటించే విషయాన్ని దాటవేసింది. అలా సస్పెన్స్ లో పెట్టడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కంగనా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కంగనా రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తున్నారు. చివరిగా ‘ధాఖడ్’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం తమిళ చిత్రం ‘చంద్రముఖి2’లో నటిస్తోంది. అలాగే ఇందిరా గాంధీ బయోపిక్ లో నటిస్తూ.. డైరెక్షన్ చేస్తూ నిర్మిస్తుస్తుండటం విశేషం. ఇక ప్రొడ్యూసర్ గానూ నవాజుద్దీన్ సిద్ధిక్ తో నిర్మించిన ‘టికూ వెడ్స్ షేర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ‘తేజస్’ మూవీ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. కంగనా ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నటిగా, ప్రొడ్యూసర్ గా ఆకట్టుకుంటున్నారు.
Prabhas home has the best food ever … and he is a wonderful host https://t.co/gmACXcPo1d
— Kangana Ranaut (@KanganaTeam)