బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పేయ్ (Manoj Bajpayee) స్టార్ హీరోయిన్ సమంత గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా ఇంటర్వ్యూలో సామ్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
నేషనల్ అవార్డు పొందిన ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయ్ తాజాగా నటించిన చిత్రం ‘గుల్మోహర్’ (Gulmohar). రాహుల్ చిట్టెల్లా దర్శకత్వం వహించారు. అమోల్ పాలేకర్, సిమ్రాన్, సూరజ్ శర్మ, కావేరి సేత్ లాంటి ప్రముఖులు నటించారు. మార్చి 3న చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మనోజ్ బాజ్ పేయ్ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ స్టార్ యాక్ట్రెస్ సమంత (Samantha) గురించి ఏదైన చెప్పండి అంటూ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆసక్తికరంగా వ్యాఖ్యలతో బదులిచ్చారు.
మనోజ్ బాజ్ పేయ్ మాట్లాడుతూ.. ‘సమంతో కలిసి పనిచేయడం చాలా ఈజీ. తన పాత్ర కోసం ఆమె చాలా కష్టపడుతుంటారు.తన హార్డ్ వర్క్ ను నేను చూసాను. ఫ్యామిలీ మ్యాన్ సెట్స్ లో శారీరకంగా కూడా విపరీతంగా కష్టపడం చూశాను. హెవీ వర్కౌట్స్ చేస్తూ తన శరీరాన్ని చాలా కష్టపెట్టేవారు. ఆమె వర్క్ చూసి ఓ దశలో నాకే భయమేసింది.’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మనోజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో సమంత కూడా స్పందించారు.
ఈ సందర్భంగా మనోజ్ బాజ్ పేయ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్వీటర్ లో పంచుకున్నారు సమంత. ఆయన మాటలకు ‘ఐ విల్ ట్రై సార్’ అంటూ ట్వీట్ చేశారు. తనను హార్డ్ వర్క్ ను ప్రశంసించినందుకు ఎమోలీతో ధన్యావాదలు తెలిపారు. ఇక లౌక్ డౌన్ లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మెన్ 2’తో ఓటీటీ అడుగుపెట్టారు సమంత. సిరీస్ ను దర్శకులు రాజ్, డీకే డైరెక్ట్ చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో సమంతతో పాటు మనోజ్ బాయ్ పేయ్, ప్రియమణి, శరద్ కేల్కర్, నీరజ్ మాధవ్, షరీబ్ హష్మీ, దలీప్ తాహిల్, సన్నీ హిందూజా, శ్రేయ ధన్వంతరి కూడా ఉన్నారు.
సమంత నటించిన ఫస్ట్ హిందీ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. తన పాత్రను అద్భుతంగా పండించడంతో సమంతకు నార్త్ లో మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ‘యశోద’ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రంలో అలరించబోతున్నారు. మరోవైపు బాలీవుడ్ లో రాజ్ డీకే దర్శకత్వంలోనే రూపుపదిద్దుకుంటున్న ‘సిటాడెట్ ఇండియన్ వెర్షన్’లోనూ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి కీలక పాత్రలో నటిస్తున్నారు.
🤗🫶🏻 will try sir https://t.co/PP4h4Ly7ES
— Samantha (@Samanthaprabhu2)