
విక్టరీ వెంకటేష్ నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులు. ఆ చిత్రంతోనే ఖుష్బూ హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. కలియుగ పాండవులు తర్వాత తెలుగు తమిళ భాషల్లో కుష్బూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఖుష్బూ తెలుగులో స్టాలిన్, యమదొంగ, అజ్ఞాతవాసి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఖుష్బూ పొలిటికల్ గా కూడా బిజీగా ఉంటోంది. ఈ మధ్యన ఖుష్బూ జబర్దస్త్ జడ్జిగా కూడా మారిన సంగతి తెలిసిందే.
ఖుష్బూ నటిగా రాణిస్తూనే పాలిటిక్స్ లో కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. దీనితో ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఉంటున్నారు. ప్రతి అంశం గమనిస్తున్నారు. కెరీర్ మంచిగా సాగుతున్న సమయంలోనే ఆమె దర్శకుడు సుందర్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు అవంతిక, ఆనందిక ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తాజాగా ఖుష్బూ ట్విట్టర్ లో తన కుమార్తెల ఫోటోని డీపీగా పెట్టుకున్నారు. ఈ ఫోటోపై ట్రోలింగ్ జరుగుతోంది. తన కుమార్తెలపై ఎవరు నెగిటివ్ కామెంట్స్ చేసినా ఖుష్బూ సహించడం లేదు. ఓ నెటిజన్.. వీళ్ళిద్దరూ ముక్కుకి సర్జరీ చేయించుకున్నారు అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. దీనితో ఖుష్బూ మండిపడింది.
20, 22 ఏళ్ల వయసున్న నా పిల్లలకు కత్తులతో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలపై ట్రోలింగ్ చేయడం సిగ్గుమాలిన చర్య. కనీసం పిల్లలని అయినా విడిచిపెట్టండి అంటూ ఖుష్బూ ఘాటుగా స్పందించారు. ఖుష్బూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఖుష్భూ కుమార్తెలు ఆన్లైన్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. తరచుగా వారిపై బాడీ షేమింగ్ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.