అత్యాచారం కేసులో నటుడికి షాకిచ్చిన న్యాయస్థానం!

Published : May 09, 2019, 07:51 PM IST
అత్యాచారం కేసులో నటుడికి షాకిచ్చిన న్యాయస్థానం!

సారాంశం

రీసెంట్ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న టివి యాక్టర్ కరణ్ ఒబేరాయ్‌‌కి మరో షాక్ తగిలింది. బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ ని అంథేరీ న్యాయస్థానం తిరస్కరించింది. అదే విధంగా 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీచేశారు. 

ఈ నెల 6వ తేదీన కరణ్ పై ఒక మహిళ కేసు నమోదు చేసింది. మొబైల్ యాప్ ద్వారా పరిచయం పెంచుకొని అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి బలవంతంగా అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు వివరించింది. 376, 384 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే కరణ్ ని అదుపులోకి తీసుకొని విచారించారు. 

అత్యచారం చేసి ఘటనను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు కూడా కరణ్ పై ఆరోపణలున్నాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలను ఇంటర్నెట్ లో రిలీజ్ చేస్తానని తనను వేధించినట్లు యువతీ పోలీసులకు తెలిపింది. సీరియస్ గా మారిన ఈ ఘటనపై  కోర్టు కరణ్ కి బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు.

PREV
click me!

Recommended Stories

Balakishna: `అఖండ 2` డిజాస్టర్‌ దెబ్బ.. బాలయ్య కొత్త సినిమాకి బడ్జెట్‌ కష్టాలు.. ఆగిపోయిందా?
ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ