సినీనటుడి ఇంట్లో విషాదం.. చిన్నారి ఉసురుతీసిన ఆటబొమ్మ

Published : May 09, 2019, 07:18 PM IST
సినీనటుడి ఇంట్లో విషాదం.. చిన్నారి ఉసురుతీసిన ఆటబొమ్మ

సారాంశం

బాలీవుడ్ బుల్లితెర నటుడి ఇంట్లో తీరని విషాదం చోటుచేసుకుంది. నవ్వుతు ఆడుకుంటున్న చిన్నారి కనురెప్ప పాటున కనుమూసింది. చూస్తుండగానే అందరిముందు కళ్ళు మూసిన ఆ చిన్నారి మరణం బాలీవుడ్ లో అందరిని షాక్ కి గురిచేసింది. 

అసలు వివరాల్లోకి వెళితే..  ప్రముఖ టీవీ నటుడు ప్రతీష్‌ వోరా కూతురు ఒక చిన్న బొమ్మతో సరదాగా ఆడుకుంటూ ఉండగా కొన్ని నిమిషాలకే ఊపిరాడక మరణించింది. ఒక చిన్న ప్లాస్టిక్ బొమ్మను పాప నోట్లో పెట్టుకోవడంతో గొంతులో ఇరికింది. ఎవరు చూడకపోవడంతో చిన్నారి ఊపిరాడక ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మరణించింది. 

ప్రస్తుతం ప్రతీష్ ‘ప్యార్ కే పాపడ్’ అనే టీవీ (స్టార్‌ భారత్‌) షోతో బిజీగా ఉన్నాడు. ఘటన గురించి తెలియగానే షాకైన అతను ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు,.కొంత మంది టివి నటీనటులు ప్రతిష్ కూతురిని ఆఖరి సారి చూసేందుకు వారి ఇంటికి చేరుకున్నారు.

PREV
click me!

Recommended Stories

NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత