ఇక 'సభకు నమస్కారం' అంటున్న అల్లరి నరేష్

Published : Jun 30, 2021, 11:48 AM IST
ఇక 'సభకు నమస్కారం' అంటున్న అల్లరి నరేష్

సారాంశం

నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఓ కొత్త మూవీ ప్రకటించారు. సభకు నమస్కారం అనే భిన్న టైటిల్ తో విడుదలైన పోస్టర్ లో అల్లరి నరేష్ ప్రీ లుక్ ఆసక్తి రేపుతోంది.

అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరో. అతి తక్కువ కాలంలో యాభై సినిమాలు పూర్తి చేసిన రికార్డు ఆయనది. అల్లరి నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ నవ్వులు అని ప్రేక్షకులు భావించేవారు. అయితే కొన్నాళ్లుగా అల్లరి నరేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయం సాధించడం లేదు. ఒక్క హిట్ కోసం ఆయన ఏళ్ల తరబడి నిరీక్షించారు. ఆయన దాహం తీర్చింది నాంది చిత్రం. 


అల్లరి నరేష్ ఓ భిన్నమైన కధాంశంతో నాంది చేశారు. న్యాయవ్యవస్థపై సామాన్యుడి పోరాటంగా తెరకెక్కిన నాంది హిట్ టాక్ అందుకుంది. దర్శకుడు కనకమేడల విజయ్ తెరకెక్కించిన నాంది, హిందీలో రీమేక్ కావడం విశేషం. అజయ్ దేవ్ గణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 


కాగా నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఓ కొత్త మూవీ ప్రకటించారు. సభకు నమస్కారం అనే భిన్న టైటిల్ తో విడుదలైన పోస్టర్ లో అల్లరి నరేష్ ప్రీ లుక్ ఆసక్తి రేపుతోంది. వేదికపై ఉన్న అల్లరి నరేష్ రెండు చేతులు ఎత్తి ఆడియన్స్ కి అభివాదం చేస్తున్నారు. ఆయన బ్యాక్ పాకెట్ లో కరెన్సీ నోట్లు, మద్యం బాటిల్  ఉన్నాయి. కామెడీ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కే సూచనలు కలవు. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు