షాకింగ్ న్యూస్... మందిరా బేడీ భర్త హఠాన్మరణం!

By team teluguFirst Published Jun 30, 2021, 10:31 AM IST
Highlights

నేడు ఉదయం గుండెపోటుకు గురైన రాజ్ కౌశల్ తుది శ్వాస విడిచినట్లు సమాచారం అందుతుంది. ఈ విషయంపై కుటుంబ సభ్యుల నుండి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అయితే రాజ్ కౌశల్ మిత్రుడు నటుడు రోహిత్ రాయ్ బోస్ ఈ విషాద ఘటనపై స్పందించారు. 

బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నటి, వ్యాఖ్యాత మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ అకాల మరణం పొందారు. నేడు ఉదయం గుండెపోటుకు గురైన రాజ్ కౌశల్ తుది శ్వాస విడిచినట్లు సమాచారం అందుతుంది. ఈ విషయంపై కుటుంబ సభ్యుల నుండి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అయితే రాజ్ కౌశల్ మిత్రుడు నటుడు రోహిత్ రాయ్ బోస్ ఈ విషాద ఘటనపై స్పందించారు. 


నా బెస్ట్ ఫ్రెండ్, బ్రదర్ అకాల మరణం పొందారు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రోహిత్ రాయ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించారు. రాజ్ కౌశల్ దర్శకుడిగా మూడు చిత్రాలు చేశారు. అలాగే నిర్మాతగా మరికొన్ని చిత్రాలు నిర్మించారు. 1992లో విడుదలైన బెకుడి అనే చిత్రానికి స్టంట్ మాన్ గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. 


1999లో మందిరా బేడీ, రాజ్ కౌశల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా 2011లో ఓ బాలుడికి మందిరా బేడీ జన్మనిచ్చారు. అలాగే వీరు ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. బాలుడు పేరు వీర్ కాగా, అమ్మాయి తారా. కొద్దిరోజుల క్రితమే ఫ్యామిలీ తో జాలిగా గడిపిన రాజ్ కౌశల్ సదరు ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. 


రాజ్ కౌశల్ మరణ వార్త విన్న బాలీవుడ్ ప్రముఖులు షాక్ కి గురయ్యారు. ఆయన మరణానికి విచారం వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నారు. 
 

click me!