Vaishnav Tej: స్టార్ ప్రొడ్యూసర్ తో మూడో చిత్రం ప్రకటించిన మెగా హీరో వైష్ణవ్

Published : Jan 13, 2022, 02:30 PM ISTUpdated : Jan 13, 2022, 02:40 PM IST
Vaishnav Tej: స్టార్ ప్రొడ్యూసర్ తో మూడో చిత్రం ప్రకటించిన మెగా హీరో వైష్ణవ్

సారాంశం

నేడు వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు ఈ మేరకు అధికారిక ప్రకటన  ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలి చిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మాస్ లుక్ ఆకట్టుకుంది.

పంజా వైష్ణవ్ (Vaishnav Tej)తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు వైష్ణవ్ తేజ్  పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు ఈ మేరకు అధికారిక ప్రకటన  ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలి చిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మాస్ లుక్ ఆకట్టుకుంది. 

అంతేకాదు భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతుందనిపిస్తుంది ఈ వీడియోను పరికిస్తే. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు.  ఇప్పటికే ధనుష్ హీరోగా తెలుగు, తమిళం లో  నిర్మితమవుతున్న 'సార్', నవీన్ పోలిశెట్టి హీరో గా మరో చిత్రం, సిద్దు జొన్నలగడ్డ హీరోగా ' డిజే టిల్లు', చిత్రాలు సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో నిర్మితమవుతున్న విషయం విదితమే.

ఇక మొదటి సినిమాతోనే వైష్ణవ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఉప్పెన(Uppena) చిన్న సినిమాగా విడుదలై స్టార్ హీరో సినిమా రేంజ్ వసూళ్లు సాధించింది. దాదాపు రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టిన ఉప్పెన చిత్రం 2021 హైయెస్ట్ గ్రాసర్స్ లో టాప్ 5లో నిలిచింది. భారీ లాభాలు తెచ్చి పెట్టిన ఉప్పెన కోవిడ్ సంక్షోభం తర్వాత పరిశ్రమకు శోభ తీసుకొచ్చింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఉప్పెన చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. 

అయితే వైష్ణవ్ రెండవ చిత్రం కొండపొలం పూర్తిగా నిరాశపరిచింది. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన కొండపొలం మూవీ అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. రకుల్ హీరోయిన్ గా నటించిన కొండపొలం వైష్ణవ్ కి బిగ్ షాక్ ఇవ్వగా.. మూడో చిత్రంతో మరో భారీ హిట్ కొట్టాలని వైష్ణవ్ కృత నిశ్చయంతో ఉన్నాడు. 

1990 జనవరి 13న జన్మించిన వైష్ణవ్ తేజ్ నేడు 32వ బర్త్ డే (Vaishnav Birthday)జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కొత్త మూవీ ప్రకటన చేశారు. వైష్ణవ్ బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. పవన్ కళ్యాణ్ జానీ, చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్, అందరివాడు చిత్రాలలో వైష్ణవ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ చేశారు. వైష్ణవ్ అన్న సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే హీరోగా పరిశ్రమలో చోటు సంపాదించుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి