Amalapaul: స్టార్ డైరెక్టర్ పర్సనల్ లైఫ్ లో చిచ్చు.. లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయిన అమలాపాల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 13, 2022, 02:27 PM IST
Amalapaul: స్టార్ డైరెక్టర్ పర్సనల్ లైఫ్ లో చిచ్చు.. లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయిన అమలాపాల్

సారాంశం

అమలాపాల్ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది.

అమలాపాల్ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. ఆమె యాటిట్యూడ్ లో కూడా మార్పు వచ్చింది. అందుకు కారణం అమలాపాల్ తన లైఫ్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకులే. పాత్ర నచ్చితే ఎలాంటి బోల్డ్ రోల్ లో అయినా అమలాపాల్ నటిస్తోంది. 

ఆడై చిత్రంలో Amala Paul న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించి సంచలనం సృష్టించింది. తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ తో ప్రేమ వివాహం చేసుకున్న అమలాపాల్ ఆ తర్వాత ఇద్దరూ విడాకులతో విడిపోయారు. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఈ సంఘటన అమలాపాల్ లో చాలా మార్పులు తీసుకువచ్చింది. ప్రస్తుతం అమలాపాల్ బోల్డ్ గా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాదు, వెబ్ సిరీస్ లు, ఓటిటి చిత్రాల్లో కూడా నటిస్తోంది. అమలాపాల్ ఇటీవల హందీలో ‘రంజిష్‌ హీ సహీ’ అనే వెబ్‌ సిరీస్‌ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ జనవరి 13 నుంచి ప్రముఖ ఓటీటీలో Voot లో స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. స్టార్‌ డైరెక్టర్‌ నిర్మాత మహేశ్‌ భట్‌ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌ తెరకెక్కింది.  ఇందులో అమలాపాల్ నటి పర్వీన్ పాత్రలో నటించింది. 

భార్య పట్ల అత్యంత విధేయుడిగా ఉండే ఆ దర్శకుడి జీవితంలోకి ఓ పాపులర్ నటి, సింగర్ పర్విన్‌ అడుగుపెట్టడంతో ఎలాంటి మలుపులు తిరిగిందన్న అంశాలని ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారు. అమలాపాల్ ఆ దర్శకుడి వైవాహిక జీవితంలో చిచ్చు పెట్టే నటిగా కనిపించబోతోంది. అందుకోసం అమలాపాల్ బోల్డ్ గా నటించింది. అమలాపాల్ నటించిన లిప్ లాక్ సన్నివేశాలు.. మద్యపానం.. సిగరెట్ తాగే సన్నివేశాల్ని ట్రైలర్ లో చూపించారు. ఎమోషనల్ గా కూడా అమలాపాల్ మెప్పిస్తోంది. 

 

 

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్