హీరో విశాల్ షాకింగ్ నిర్ణయం, సాహసం చేయబోతున్నాడా..?

Published : Mar 17, 2024, 05:00 PM IST
హీరో విశాల్ షాకింగ్ నిర్ణయం, సాహసం చేయబోతున్నాడా..?

సారాంశం

తమిళంలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు విశాల్. తెలుగులో కూడా ఈ స్టార్ హీరోకు మంచి మార్కెట్ ఉంది. కెరీర్ మంచి రన్నింగ్ లో ఉండగా.. విశాల్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ స్టార్ హీరో ఏం చేయబోతున్నాడంటే..?   

త‌మిళంతో పాటు.. తెలుగులో కూడా  మంచి మార్కెట్ కలిగి ఉన్నాడు హీరో విశాల్‌. తెలుగు సంతతికిచెందిన ఈ సీనియర్ హీరో.. తమిళంలో హీరోగా సెటిల్ అయ్యాడు. 46 ఏళ్లు వచ్చినా  పెళ్లి చేసుకోలేదు విశాల్. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు విశాల్. అంతే కాదు డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ ను చేయడంలో కూడా విశాల్ ముందుంటాడు. ఈక్రమంలోనే ఆయన చాలాసార్లు 
షూటింగ్స్ లో గాయపడటం కూడా జరిగింది. 

ఇక  కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు విశాల్.  త్వరలో విశాల్‌ రత్నం సినిమాతో రాబోతున్నాడు. ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరు విశాల్. ఇప్పటి వరకూ హీరోగా, నిర్మాతగా..నటీనటుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్న విశాల్.. ఇప్పుడు మరో ప్రయోగం చేయబోతున్నాడు. ప్రస్తుతం విశాల్ చేస్తున్నరత్నం సినిమా హరి డైరెక్ట్ చేస్తుండగా. జీ స్టూడియోస్ తో సంయుక్తంగా స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత విశాల్ తనపాత సినిమాకు సీక్వెల్ ను చేయబోతున్నారు. 

తాను చేయబోయే సినిమాలో హీరోగా నటిస్తూనే.. దర్శకత్వ బాధ్యతలు కూడా  చేపట్టనున్నాడు విశాల్. గతంలో కోలీవుడ్ ద‌ర్శ‌కుడు మిస్కిన్ దర్శకత్వంలో వ‌చ్చిన డిటెక్టివ్‌ సినిమాకు సీక్వెల్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు విశాల్. ఈ సినిమా త‌మిళంతో పాటు తెలుగులో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ రానుండ‌గా.. డిటెక్టివ్ 2 సినిమాతో  దర్శకుడిగా మారారు విశాల్.

 

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ట్విట్టర్ లో విశాల్ ఈ విధంగా మాట్లాడారు.  25 ఏండ్ల త‌ర్వాత ఎట్టకేలకు నేను అనుకున్న ప్రయాణం మొదలైంది. నా కల, నా ఆకాంక్ష, నా మొదటి ఆలోచన ఎట్టకేలకు నా జీవితంలో నిజం కాబోతోంది. అవును, నా కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన కొత్త బాధ్యతను తీసుకోబోతున్నా. దర్శకుడిగా పరిచయమవడం అన్నది నా కెరీర్‌లో అత్యంత సవాల్‌తో కూడుకున్నది. నా డైరెక్ష‌న్‌లో వ‌స్తున్నా తొలి సినిమా తుప్పరివాలన్2 ...డిటెక్టివ్2 కోసం లండన్ బయలుదేరాం. అజర్‌బైజాన్‌, మాల్లాల్లో షూటింగ్‌ చేయబోతున్నాం. అన్నారు. 

అంతే కాదు.. ఈ విషయాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. మ‌నం పడిన కష్టం ఎప్పుడూ వృథా కాదు అంటూ నా తండ్రి జీకే రెడ్డి, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్‌ చెప్పిన మాటలు ఎప్పుడూ మర్చిపోను. ఏది ఏమైనా, ఫలితం ఎలా వచ్చిన కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించడం మానొద్దు. నటుడిగా నాకు ఈ గుర్తింపు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా కల ఇంత త్వరగా సాకారం కావడానికి కారణమైన మిస్కిన్‌ సర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటూ విశాల్‌ ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?