ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు బయోపిక్ లు విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. త్వరలోనే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ ల బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు బయోపిక్ లు విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. త్వరలోనే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ ల బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తమిళంలో దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితల బయోపిక్ లు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఇప్పుడు మరో నటుడి బయోపిక్ తో సినిమా తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 1950 నుండి 1970 వరకు తమిళ ఇండస్ట్రీలో హీరోగా, కమెడియన్ గా పలు చిత్రాలలో నటించిన జెపి చంద్రబాబు జీవిత చరిత్రతో సినిమా చేయాలనుకుంటున్నారు. ''జెపీ ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు'' పేరుతో ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సీనియర్ దర్శకుడు కె.రాజేశ్వర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. గతంలో అమరన్, కోవిల్ పట్టి వీరలక్ష్మి, ఇదయతారై వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను రూపొందించిన కె.రాజేశ్వర్ పలు హిందీ చిత్రాలకు కథలను కూడా అందించారు.
ఇప్పుడు చంద్రబాబు బయోపిక్ ని మొదలుపెట్టనున్నారు. చంద్రబాబు పాత్ర కోసం ప్రముఖ నటుడితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సినిమాలో అప్పటితారలు ఎంజీఆర్, జెమినీ గనేషన్, సావిత్రి వంటి నటులు అలానే రాజకీయనాయకులు పాత్రలు కూడా ఉండబోతున్నాయి.