బెల్లంకొండకి తెలిసొచ్చిందా..?

Published : Dec 12, 2018, 10:49 AM IST
బెల్లంకొండకి తెలిసొచ్చిందా..?

సారాంశం

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేసి చాలా కాలం అవుతోంది. మొదటి నుండి బెల్లంకొండ శ్రీనివాస్ పెద్ద దర్శకులు, భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తూ వస్తున్నాయి. 

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేసి చాలా కాలం అవుతోంది. మొదటి నుండి బెల్లంకొండ శ్రీనివాస్ పెద్ద దర్శకులు, భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తూ వస్తున్నాయి.

దీంతో అతడి సినిమాలకు ఖర్చు ఎక్కువవుతుండంతో సక్సెస్ అవడం లేదనే అనుమానాన్ని రేకెత్తించారు. అయితే 'కవచం' సినిమాతో అతడి అసలు మార్కెట్ విషయం బయటపడింది. స్టార్ డైరెక్టర్ లేకపోతే బెల్లంకొండ సినిమాలు ప్రేక్షకులు చూడరని ఈ సినిమాతో తేలిపోయింది. ఈ సినిమా ఫుల్ రన్ లో ఏడెనిమిది కోట్ల షేర్ మించి సాధించడం కష్టమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

సినిమా ప్రమోషన్స్ సమయంలో తనకు పదిహేను కోట్ల మార్కెట్ ఉందని అన్నాడు బెల్లంకొండ. దానికి కొన్ని లెక్కలు కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు రియాలిటీ బయటపడడంతో తన పారితోషికం తగ్గించుకున్నాడని సమాచారం. తన సినిమా థియేట్రికల్ రైట్స్ మార్కెట్ లో పది నుండి పన్నెండు కోట్లు మాత్రమే ఉంటుందని లెక్కగట్టి దానికి తగ్గట్లుగా తన రెమ్యునరేషన్ ఇతర విషయాలపై ఖర్చు తగ్గించుకుంటూ వస్తున్నాడు.

ప్రస్తుతం అతడు తేజ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. అలానే మరికొన్ని సినిమా అవకాశాలు చేతిలో ఉన్నాయి. మరి తేజ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట
Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు