నగ్నంగా నటించేందుకు రెడీ అంటున్న రామ్ హీరోయిన్!

Published : Aug 02, 2019, 02:39 PM ISTUpdated : Aug 02, 2019, 04:53 PM IST
నగ్నంగా నటించేందుకు రెడీ అంటున్న రామ్ హీరోయిన్!

సారాంశం

ప్రస్తుతం సౌత్ హీరోయిన్లు కమర్షియల్ చిత్రాలతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సమంత లాంటి హీరోయిన్లయితే లేడి ఓరియెంటెడ్ చిత్రాలతోనే వినోదాన్ని కూడా అందిస్తున్నారు. హీరోయిన్ బిందుమాధవి కూడా అలాంటి పాత్రలకు తాను సిద్ధం అని అంటోంది. 

కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడాకి కూడా తాను సిద్దమే అని అంటోంది. ఇటీవల సౌత్ హీరోయిన్లు పాత్ర డిమాండ్ మేరకు సాహసోపేతమైన రోల్స్ చేస్తున్నారు. అమలాపాల్ అయితే 'ఆమె' చిత్రంలో నగ్నంగా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి విమర్శలతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. 

నయనతార, త్రిష, అమలాపాల్ లాంటి హీరోయిన్లు కథ నచ్చితే ఎలాంటి సాహసానికైనా సిద్ధం అవుతున్నారు. ఆ క్రమంలో నగ్నంగా నటించే చిత్రం వస్తే తప్పకుండా చేస్తాను అని బిందుమాధవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

బిందుమాధవి తెలుగులో రామ రామ కృష్ణ కృష్ణ, పిల్ల జమిందార్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ వరుసగా తమిళ చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. 

PREV
click me!

Recommended Stories

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?