బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల ‘సిగ్గుచేటు’.. కన్నీరు పెట్టుకున్న నటి షబానా అజ్మీ.!

Published : Sep 01, 2022, 06:39 PM ISTUpdated : Sep 01, 2022, 06:53 PM IST
బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల ‘సిగ్గుచేటు’..  కన్నీరు పెట్టుకున్న నటి షబానా అజ్మీ.!

సారాంశం

20 ఏండ్ల కింద గుజరాత్ అల్లర్ల సమయంలో ఓ గర్భిణీనిపై 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల వారికి గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. దీనిపై నటి, సోషల్ యాక్టివిస్ట్ షబానా అజ్మీ స్పందించారు.. ఇది ‘సిగ్గు చేటు’ చర్యగా  భావించారు.  

2002 సమయంలో గుజరాత్ రాష్ట్రంలో తీవ్ర అల్లర్లు  జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్రంలోని అహ్మదాబాద్ పరిధిలో గల రంధిక్ పూర్ గ్రామంలో ఐదు నెలల గర్భిణీ అయిన బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్ జరిగింది. అంతేకాకుండా గర్భిణి మూడేళ్ల కూతురును, కుటుంబ సభ్యుల్లోని ఆరుగురిని దారుణంగా హత్య చేశారు. అప్పట్లో ఈ విషయం పెద్దఎత్తున పోరాటాలు జరిగాయి. బిల్కిస్ బానో రేపిస్టులను (Bilkis Bano rapist) అత్యంత కఠినంగా శిక్షించాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. 

అయితే వారిని ఇటీవల అక్కడి బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెడుతూ వదిలిపెట్టింది. 11 మంది దోషులను అలా విడుదల చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి విడుదల సందర్భంగా కొందరు హారతులిస్తూ.. పూలదండలంతో ఘన స్వాగతం పలుకుతూ.. స్వీట్లు తినిపించడం పట్ల మరింతగా వ్యతిరేకత వస్తోంది. ఈ సందర్భంగా ఇప్పటికే బిల్కిస్ బానో రేపిస్టుల విడుదలను వ్యతిరేకిస్తున్న నటి, సోషల్ యాక్టివిస్ట్ షబానా అజ్మీ (Shabana Azmi) తాజాగా స్పందించింది. ‘రేపిస్టులను విడుదల చేయడం సిగ్గుచేటు.  వారికి పూలదండలు వేయడం ఆశ్చర్యపోయాను. ఇది నిజంగా అసహ్యంగా ఉందం’టూ కన్నీరు పెట్టుకుంది. దీని ద్వారా ఏం సందేశం చెబుతున్నారంటూ ప్రశ్నించింది. దోషుల విడుదలపై మహిళా ఎంపీలు, మంత్రులు మౌనం వహించడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  

బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి షబానా వ్యతిరేకిస్తూనే ఉంది. రేపిస్టులను అలా వదిలేసినప్పటికీ స్వాగతాలు పలకడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే..  హైదరాబాద్ కు చెందిన షబానా అజ్మీ బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఏడు పదుల వయస్సులోనూ షబానా అటు సినిమాల్లో నటిస్తూనే.. ఇటు సోషల్  ఇష్యూస్ పైనా తనదైన శైలిలో స్సందిస్తోంది.  !974 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం  కూడా రెండు చిత్రాల్లో నటిస్తోంది. ‘వాట్స్ లవ్ గాట్ టు డూ విత్ ఇట్’,‘రాకీ  ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ చిత్రంలోనూ కీలక పాత్రల్లో నటిస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?