బిగ్ ప్లాన్ తో సిద్దమవుతున్న 'బిగిల్' టీమ్

Published : Aug 27, 2019, 06:04 PM IST
బిగ్ ప్లాన్ తో సిద్దమవుతున్న 'బిగిల్' టీమ్

సారాంశం

  కోలీవుడ్ స్టార్ హీరో ఇళయథలపతి విజయ్ ప్రస్తుతం బిగిల్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాల డోస్ రోజురోజుకి తారా స్థాయికి చేరుకుంటోంది. 

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయథలపతి విజయ్ ప్రస్తుతం బిగిల్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాల డోస్ రోజురోజుకి తారా స్థాయికి చేరుకుంటోంది. పైగా చిత్ర యూనిట్ కూడా సినిమా పోస్టర్స్ తో ఆడియెన్స్ ని సరికొత్తగా త్రిల్ చేయడంతో సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. 

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఫ్యాన్స్ కోరిక మేరకు సినిమా ఆడియో ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అభిమానులకు లైవ్ లో ఫుల్ జోష్ ఇవ్వాలని విజయ్ టీమ్ సిద్దమవుతున్నట్లు టాక్. 

సెప్టెంబర్ 15న సినిమా ఆడియో వేడుకను నిర్వహించనున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ తన టీమ్ తో కలిసి లైవ్ పెర్ఫెమెన్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్న బిగిల్ టీమ్ కోలీవుడ్ ఆడియెన్స్ కి ఎలాంటి కిక్కిస్తుందో చూడాలి. 130కోట్ల బడ్జెట్ తో AGS ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అలరించనున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌