సైరా భానుకు తెలియకుండా హైదరాబాద్ మహిళతో రహస్య వివాహం.. దిలీప్ కుమార్ జీవితంలో అతిపెద్ద వివాదం

Published : Jul 08, 2021, 09:48 AM ISTUpdated : Jul 08, 2021, 10:44 AM IST
సైరా భానుకు తెలియకుండా హైదరాబాద్ మహిళతో రహస్య వివాహం.. దిలీప్ కుమార్ జీవితంలో అతిపెద్ద వివాదం

సారాంశం

నటుడిగా అనేక మైలురాళ్ళు అందుకున్న దిలీప్ కుమార్ జీవితంలో విజయాలతో పాటు వివాదాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ మహిళతో ఆయన రహస్య రెండవ వివాహం పెద్ద వివాదాస్పదం అయ్యింది.


దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ అంత్యక్రియలు నిన్న ముంబైలో ముగిశాయి. అమితాబ్, షారుక్, రన్బీర్ కపూర్ లతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు. దిలీప్ కుమార్ మరణం ఘనమైన అధ్యాయానికి ముగింపుగా చిత్ర ప్రముఖులు అభివర్ణించారు. దిలీప్ మరణం నేపథ్యంలో ఆయన విజయాలు, వివాదాలు మరోమారు చర్చనీయాంశం కావడం జరిగింది. 


దిలీప్ కుమార్ జీవితంలో అత్యంత వివాదాస్పద అంశంగా ఆయన రెండవ వివాహం ఉంది. 1966లో సైరా భానును వివాహం చేసుకున్న ఆయన హైదరాబాద్ కి చెందిన అస్మా బేగం అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నారు. సైరా భానుకు తెలియకుండా జరిగిన ఈ రహస్య వివాహం బయటకు పొక్కడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 


హైదరాబాద్ లో దిలీప్ కుమార్ కి ప్రాణమిత్రుడు ఒకరు ఉండేవారట. అతనిని కలవడానికి అప్పుడప్పుడూ ఆయన హైదరాబాద్ వస్తూ ఉండేవారు. ఈ క్రమంలో మిత్రుడు చెల్లెలు ద్వారా అస్మా బేగం అనే మహిళతో ఆయనకు పరిచయం ఏర్పడింది. చివరకు పెళ్లి చేసుకునే వరకు ఈ బంధం సాగింది. 1980లో దిలీప్ కుమార్ అస్మా బేగంను వివాహం చేసుకున్నారట. 


అయితే తన ఈ రెండవ వివాహం గురించి సైరా భానుకు తెలియకూడదు, మన పెళ్లి రహస్యంగానే ఉండాలని దిలీప్ ఆమెకు షరతు విధించారట. అయితే అస్మా బేగం మాత్రం ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ ఏకంగా మకాం ముంబైకి మార్చరట. కొద్దికాలంలోనే వీరి రహస్య బంధం గురించి మీడియాకు తెలిసిపోయింది. అప్పట్లో ఓ ప్రముఖ పత్రిక దిలీప్ కుమార్, అస్మా బేగం రిలేషన్ షిప్ బయటపెడుతూ కథనం రాయడంతో సంచలనం రేగింది. కాంగ్రెస్ నేత శరద్ పవార్, మరొక వ్యక్తి కలిగి ఈ వివాదాన్ని సెటిల్ చేశారట. 1983లో అస్మా బేగంకు  అధికారికంగా విడాకులు ఇచ్చి విడిపోవడం జరిగింది. 
 

PREV
click me!

Recommended Stories

Kannamoochi Web Series: దాగుడుమూతలు ఆడుతూ కూతురు మాయం.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న వెబ్ సిరీస్
Mamitha Baiju Salary: ఒకప్పుడు లక్షల్లో.. ఇప్పుడు కోట్లలో.. మమితా బైజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?