ప్రియాని గుంటనక్కతో పోల్చిన నటరాజ్‌ మాస్టర్‌.. ఊహించిందే జరిగింది.. సెకండ్‌ వీక్‌ నామినేషన్స్ వీళ్లే..

By Aithagoni RajuFirst Published Sep 13, 2021, 11:41 PM IST
Highlights

వోల్ఫ్‌ జట్టులో రవి, ఉమాదేవి, స్వేత వర్మ, కాజల్‌, లహరి, మానస్‌, సన్నీ, జెస్సీ, నటరాజ్‌ మాస్టర్‌ ఉండగా, ఈగల్‌ జట్టులో లోబో, ప్రియాంక, ప్రియా, శ్రీరామచంద్ర, హమీద, విశ్వ, షణ్ముఖ్‌, అనీ, సిరి ఉన్నారు. వోల్ఫ్‌ జట్టు ఎల్లో కలర్‌ టీషర్ట్స్, ఈగల్‌ జట్టు పర్పుల్ కలర్‌ టీ షర్ట్ ధరించారు. నామినేషన్‌ ప్రక్రియలో ఇంటిసభ్యులు రెచ్చిపోయారు.

బిగ్‌బాస్‌ 5 రెండో వారానికి చేరుకుంది. మొదటి వారం షో అల్లరి చిల్లరగా, హైడ్రామాగా సాగింది. సరయు ఫస్ట్ వీక్ ఎలిమినేట్‌ అయ్యింది. రెండో వారం ప్రారంభం నుంచే రంజుగా మారింది. నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ రెచ్చిపోయి నామినేట్‌ చేసుకున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలతో రెచ్చిపోయారు. ఆరోపణలతో షోని మరింత రంజుగా మార్చారు. 8వ రోజు(సోమవారం) కంటెస్టెంట్ల మధ్య సరదా సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. 

లోబోని యాంకర్‌ రవి ఆటపట్టించడం, ప్రియాంక సింగ్‌ గురించి జెస్సీ మాట్లాడటం వంటి సన్నివేశాలు, అలాగే కిచెన్‌కి సంబంధించి విషయాల్లో ఉమాదేవి కాస్త ఘాటుగా రియాక్ట్ అవ్వడం, లోబో లైట్‌ తీసుకోవడం సరదాగా సాగిపోయాయి. ఇక నామినేషన్ల పర్వం వచ్చినప్పుడు ఇంటి సభ్యులను రెండుగా విడగొట్టాడు బిగ్‌బాస్‌. వోల్ఫ్‌, ఈగల్‌ జట్టులుగా తొమ్మిది తొమ్మిది మందిని జట్టుని విడగొట్టారు. 

వోల్ఫ్‌ జట్టులో రవి, ఉమాదేవి, స్వేత వర్మ, కాజల్‌, లహరి, మానస్‌, సన్నీ, జెస్సీ, నటరాజ్‌ మాస్టర్‌ ఉండగా, ఈగల్‌ జట్టులో లోబో, ప్రియాంక, ప్రియా, శ్రీరామచంద్ర, హమీద, విశ్వ, షణ్ముఖ్‌, అనీ, సిరి ఉన్నారు. వోల్ఫ్‌ జట్టు ఎల్లో కలర్‌ టీషర్ట్స్, ఈగల్‌ జట్టు పర్పుల్ కలర్‌ టీ షర్ట్ ధరించారు. నామినేషన్‌ ప్రక్రియలో ఇంటిసభ్యులు రెచ్చిపోయారు. ఉమాదేవి, స్వేత వర్మ, లోబో, కాజల్‌ వంటి వారు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నామినేట్‌ చేసేవారిపై స్ర్టాంగ్‌గా ఫైర్‌ అవుతూ కారణాలు చెప్పడం షోని, గేమ్‌ని హీటు పెంచేసింది. 

హ్యూమానిటీ లేదంటూ స్వేత వర్మ ఫైర్‌ అయ్యింది. లోబో, హమీద ఫేక్‌ అంటూ మండిపడింది. అయితే ఆమె కూడా వారి ముఖాలపై చాలా ఎక్కువగా రంగు పూయడం చాలా ఇబ్బంది పెట్టింది. దీనికి ప్రియా స్పందిస్తూ హ్యూమానిటీ గురించి మాట్లాడి నువ్వు చేసిందేంటి? అంటూ ప్రశ్నించింది. మరోవైపు ఉమాదేవి నామినేషన్‌కి ముందు వచ్చి కొన్ని బూతు పదాలు వాడటం ఇంటి సభ్యులను ఇబ్బంది పెట్టింది. షణ్ముఖ్‌ దాన్ని తీసుకోలేకపోయాడు. ప్రియాంక సింగ్‌ నవ్వాపుకోలేదు. అదే సమయంలో పోవే ఉమా పో అనడం ఇబ్బందిగా మారింది. 

ఇక నటరాజ్‌ మాస్టర్‌ గుంటనక్క వచ్చి ఇంట్లో ఏడుగురు సభ్యులను చెడగొట్టిందని, అది తనని నామినేట్‌ అయ్యేలా చేసిందని వాపోయాడు. ఆయన వ్యాఖ్యలకు ప్రియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మొత్తం ప్రాసెస్‌లో అనీ మాస్టర్‌ కన్నీళ్లు పెట్టుకుంది. తనని తాను కోల్పోతున్నానని కాజల్‌ సైతం ఎమోషనల్‌ అయ్యింది. 

రెండో వారంలో ముందు నుంచి వినిపిస్తున్నట్టుగానే ఏడుగురు సభ్యులు నామినేట్‌ అయ్యారు. వోల్ఫ్‌ టీమ్‌ నుంచి ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌, కాజల్‌, ఈగల్‌ టీమ్‌ నుంచి లోబో, ప్రియాంక సింగ్‌, అనీ మాస్టర్‌, ప్రియా రెండో వారం ఎలిమినేషన్‌ కోసం నామినేట్‌ అయ్యారు. ఈ వారం మొత్తం ఇంటి సభ్యులు రెండు టీములగానే గేమ్‌ ఆడబోతున్నారు. సిరి కెప్టెన్‌ కావడంతో ఈ వారం ఆమె నామినేషన్‌ నుంచి తప్పించుకున్నారు.

click me!