టీమ్‌ లీడర్‌గా నోయల్‌.. కళ్యాణి గాసిప్‌ల గోల

Published : Sep 18, 2020, 10:58 PM ISTUpdated : Sep 18, 2020, 11:02 PM IST
టీమ్‌ లీడర్‌గా నోయల్‌..  కళ్యాణి గాసిప్‌ల గోల

సారాంశం

మూడో వారం ప్రారంభం కాబోతున్న సమయంలో టీమ్‌ లీడర్‌ మార్చడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే కొత్త టీమ్‌ లీడర్‌ ఎంపికలో లాస్య ప్రధానంగా నలుగురి నోయల్‌, అభిజిత్‌, కళ్యాణి, మెహబూబ్‌ పేర్లని సూసించింది. వారు నలుగురు వచ్చి తాము ఏం చేస్తామో తెలిపారు. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు పూర్తి చేసుకుంటోంది. శనివారం రెండో ఎలిమినేషన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌజ్‌లో టీమ్‌ లీడర్‌ని మార్చడం చర్చనీయాంశంగా మారింది. ప్రారంభం నుంచి టీమ్‌ లీడర్‌గా లాస్య ఉండి, అన్ని సవ్యంగా అయ్యేలా చూసుకున్నారు. 

మూడో వారం ప్రారంభం కాబోతున్న సమయంలో టీమ్‌ లీడర్‌ మార్చడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే కొత్త టీమ్‌ లీడర్‌ ఎంపికలో లాస్య ప్రధానంగా నలుగురి నోయల్‌, అభిజిత్‌, కళ్యాణి, మెహబూబ్‌ పేర్లని సూసించింది. వారు నలుగురు వచ్చి తాము ఏం చేస్తామో తెలిపారు. అయితే అందరు కలిసి నోయల్‌ అయితే బాగుంటుందని చెప్పడం విశేషం.

 ఇక నోయల్‌ తన వంతు వచ్చేసరికిగా ఎవరికి ఏం అవసరం ఉందో తెలుసని, వారి అవసరాలు తెలుసుకుని సర్వ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఇలా సభ్యులందరు నోయల్‌ పేరుని బిగ్‌బాస్‌కి సిఫార్సు చేశారు. బిగ్‌బాస్‌ కూడా నోయల్‌ని ఫైనల్‌ చేశాడు. బిగ్‌బాస్‌ ఫనిష్‌మెంట్‌ టైమ్‌లో నోయల్‌ నాగార్జునతో చెప్పి ఈ శనివారం వెళ్ళిపోతానని బెదిరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు లీడర్‌షిప్‌ కట్టబెడటం అనేక ఆలోచనలకు తావిస్తోంది.

ఆ వెంటనే కిచెన్‌ టీమ్‌ని మార్చేశారు. కళ్యాణి కిచెన్‌ నుంచి తప్పుకుని ఇప్పుడు ఫ్రీ అయ్యింది. తాను ఫ్రీగా ఉంటే గాసిప్‌లు వస్తాయని చెప్పడం నవ్వులు పూయించింది. అంతకు ముందు కిచెన్‌లో లాస్యకి, నాగవల్లికి వివాదం నెలకొంది. తనకి ఇచ్చిన పని చేస్తున్నానని నాగవల్లి స్పష్టం చేసింది. అయితే ఎలిమినేషన్‌ ప్రారంభమైనప్పట్నుంచి వెనకాల ఏదో జరుగుతుంది. అందరు ఏదో డిస్కస్‌ చేసుకున్నారని, ఏదో తేడా జరుగుతుందని వివాదం క్రియేట్‌ చేసింది. దాన్ని లాస్య ఆపే ప్రయత్నం చేసినా దేవి వినకుండా వెళ్లిపోయింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా