రచ్చ చేసిన నాగవల్లి.. బిగ్‌బాస్‌ క్రమశిక్షణ చర్యలు..గుంజీలతో చెడుగుడు

Published : Sep 18, 2020, 10:15 PM ISTUpdated : Sep 18, 2020, 10:44 PM IST
రచ్చ చేసిన నాగవల్లి.. బిగ్‌బాస్‌ క్రమశిక్షణ చర్యలు..గుంజీలతో చెడుగుడు

సారాంశం

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ పన్నెండో రోజు ట్విస్ట్ లు, టర్న్‌లతో సాగింది. ఫన్నీ థింగ్స్, కాంట్రవర్సీలకు తెరలేపింది. పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా పన్నెండో రోజు ఏం జరిగిందనేది చూస్తే. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ పన్నెండో రోజు ట్విస్ట్ లు, టర్న్‌లతో సాగింది. ఫన్నీ థింగ్స్, కాంట్రవర్సీలకు తెరలేపింది. పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా పన్నెండో రోజు ఏం జరిగిందనేది చూస్తే. 

మొదట రాత్రి కుమార్‌ సాయి, అవినాష్‌ టీమ్‌లు  కామెడీ చేసి నవ్వించే ప్రోగ్రామ్‌లు ప్రారంభమయ్యాయి. బీబీ టీవీ కామెడీ షోని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో కుమార్‌ సాయి సరిగా నవ్వించలేకపోయింది. వారి ట్రాక్‌ అర్థం కాలేదు. అవినాష్‌ కామెడీ స్కిట్‌ ఆకట్టుకుంది. గంగవ్వని ఇదే విషయం అడగ్గా ఆమె అవినాష్‌ టీమ్‌ కామెడీ బాగుందని తెలిపింది. 

జడ్జెస్‌ నోయల్‌, లాస్య దీన్ని ప్రత్యేకంగా చర్చించారు. అమ్మరాజశేఖర్‌ ఈ విషయంలో ఫీల్‌ అయ్యారని ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన రెండు టీమ్‌లకు గిఫ్ట్ లు ఇవ్వాల్సిందన్నారు. ఇంతలో బిగ్‌బాస్‌ నుంచి కాల్‌. రెండు టీమ్‌కు కూల్‌డ్రింక్‌ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్‌ చేశారు. 

దీని తర్వాత రాత్రి కరాటే కళ్యాణి ఓ పాటతో అలరించింది. అందరు ఆమెతో కలిసి పాట పాడుతూ స్టెప్పులేశారు. రాత్రి సమయంలో మంచి రిలాక్సేషన్‌గా సాగింది. 

పన్నెండో రోజు మార్నింగ్‌ సాంగ్‌తో లేచి డాన్సులు వేశారు. ఆ తర్వాత కిచెన్‌లో లాస్యకి, దేవీ నాగవల్లికి మధ్య వివాదం జరిగింది. పని విషయంలో వివాదం ఎలిమినేషన్‌కి తీసుకెళ్ళింది. నామినేషన్‌ జరిగిన తర్వాత మీరంతా ఏదో జరుగుతుంది. 

ఇంటి సభ్యులు క్రమ శిక్షణ తప్పారని బిగ్‌బాస్ భావించారు. టైమ్‌ పాటించకపోవడం, పనులు చేయడంలో, అలాగే తెలుగు కాకుండా ఇంగ్లీష్‌ మాట్లాడే విషయంలో మోనాల్‌, అభిజిత్‌, అఖిల్‌, నోయల్‌, హారికకు బోర్డ్ పై తెలుగులో రాయాలనే శిక్ష వేశాడు. అంతేకాదు సుజాత వద్ద తెలుగు నేర్చుకోవాలని చెప్పాడు. టైమ్‌ పాటించే విషయంలో అందరిని గార్డెన్‌లో ఇరవై గుంజీలు తీయాలనే కండీషన్‌ పెట్టాడు. 

బిగ్‌బాస్‌ ఫనిష్‌మెంట్‌ ఇచ్చే క్రమంలో నోయల్‌ తనకు బిగ్‌బాస్‌ వచ్చి స్వారీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ శనివారం నేను వెళ్ళిపోతానని, నాగార్జున సర్‌కి చెప్పే వెళ్ళిపోతా అని ఫైర్‌ అయ్యాడు. మొత్తంగా రెండు సార్లు ఇంటి సభ్యులు మొత్తం ఇరవై గుంజీలు తీయాల్సి వచ్చింది. ఇది పూర్తయిన తర్వాత లగ్జరీ బడ్జెట్‌ విజయవంతంగా పూర్తయ్యిందని, టీమ్‌ని బిగ్‌బాస్‌ అభినందించాడు. 

ఇంటిసభ్యుల కెప్టెన్‌ని మార్చే ఎపిసోడ్‌ తెరపైకి వచ్చింది. లాస్య స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలని చెప్పారు. నోయల్‌, అభిజిత్‌, మెహబూబ్‌, కళ్యాణి పేర్లని సూచించగా, అందరు యునానమస్‌గా నోయల్‌ పేరుని సూచించి బిగ్‌బాస్‌కి చెప్పగా, బిగ్‌బాస్‌ ఓకే చెప్పి నోయల్‌కి అభినందనలు తెలిపాడు. కిచెన్‌ టీమ్‌ని కూడా మార్చారు. అయితే కిచెన్‌ టీమ్‌ విషయంలో కళ్యాణి, మాస్టర్‌, దేవి నాగవల్లి మధ్య వివాదం నెలకొంది. వీరి మధ్యం ఇంకా ఏదో జరుగుతుందనే విషయాలు బయటపడ్డాయి. 

కళ్యాణి స్వయంగా తప్పుకున్నారు. తాను బయట ఉంటే గాసిప్‌లు వస్తాయని, అందుకే కిచెన్‌లో ఉంటున్నానని చెప్పి అందరిని నవ్వించింది. అర్థరాత్రి అవినాష్‌ తనదైన మిమిక్రీ, యాక్టింగ్‌తో నవ్వులు పూయించాడు. మొత్తంగా ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చారు. అయితే చివరగా మోనాల్‌, అఖిల్‌ మధ్య తమ ఎఫైర్‌కి సంబంధించి డిస్కషన్‌ జరగడం గమనార్హం. ఇలా మొత్తంగా పన్నెండో రోజు బిగ్‌బాస్‌ కాస్త ఆసక్తికరంగానే సాగిందని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా