జాక్ పాట్‌ కొట్టిన బిగ్‌బాస్‌ షణ్ముఖ్‌.. `ఆహా`లో క్రేజీ వెబ్‌ సిరీస్‌.. ఏజెంట్‌ అవతారం..

Published : May 14, 2022, 10:05 PM IST
జాక్ పాట్‌ కొట్టిన బిగ్‌బాస్‌ షణ్ముఖ్‌.. `ఆహా`లో క్రేజీ వెబ్‌ సిరీస్‌.. ఏజెంట్‌ అవతారం..

సారాంశం

ఇన్నాళ్లు కాస్త సైలెంట్‌గా ఉన్న షణ్ముఖ్‌కి జాక్‌ పాట్‌ తగిలింది. ఆయనకు ఏకంగా `ఆహా`లో ఆఫర్‌ వచ్చింది. `ఆహా` ఒరిజినల్‌లో నటించే ఛాన్స్ ని దక్కించుకున్నారు.

యూట్యూబ్‌లో స్టార్‌గా రాణించారు షణ్ముఖ్‌ జస్వంత్‌. ఆ ఇమేజ్‌తోనే ఆయనకు `బిగ్‌బాస్‌ 5` లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇందులో తనదైన ఆట తీరుతో ప్రత్యేక స్థానంలో నిలిచారు. ఫైనల్‌ రన్నరప్‌గా నిలిచారు. బిగ్‌బాస్‌లో సిరి హన్మంత్‌తో కలిసి ఆయన కెమిస్ట్రీ బాగా పండింది. ఈ కెమిస్ట్రీ అనేక విమర్శలను ఎదుర్కొంది. చివరికి తన ప్రేమని కోల్పోయేలా చేసింది. ఆయన తన తోటి యూట్యూబర్‌ దీప్తిసునైనాతో ప్రేమలో పడిన విసయం తెలిసిందే. వీరిద్దరు ఎంతగానో పాపులర్‌ అయ్యారు. కానీ బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక షణ్ముఖ్‌కి బ్రేక్‌ చెప్పింది దీప్తి. 

ఇదిలా ఉంటే ఇన్నాళ్లు కాస్త సైలెంట్‌గా ఉన్న షణ్ముఖ్‌కి జాక్‌ పాట్‌ తగిలింది. ఆయనకు ఏకంగా `ఆహా`లో ఆఫర్‌ వచ్చింది. `ఆహా` ఒరిజినల్‌లో నటించే ఛాన్స్ ని దక్కించుకున్నారు. షణ్ముఖ్‌ జస్వంత్‌ మెయిన్‌ లీడ్‌గా `ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌` పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ని రూపొందిస్తుంది `ఆహా`. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. `ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌` వచ్చేస్తున్నాడు. కేసు వివరాలు త్వరలో ` అంటూ ఫస్ట్ లుక్‌ని పంచుకున్నారు. ఇందులో ఏజెంట్‌ లుక్‌లో షణ్ముఖ్‌ ఆకట్టుకుంటున్నారు. ఆయన అభిమానులకు మంచి సర్‌ప్రైజింగ్‌ విషయమనే చెప్పాలి. దీనికి సుబ్బు కే కథ అందించగా, అరుణ్‌ పవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే `బిగ్‌బాస్‌ 5`లో తనకు జోడీగా వ్యవహరించిన సిరి హన్మంత్‌ కూడా `ఆహా`లో ఓ సిరీస్‌ చేస్తుంది. ఆమె `బీఎఫ్‌ఎఫ్‌` పేరుతో ఓ సిరీస్‌ చేస్తుండగా, దాన్ని రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఆ వెంటనే ఇప్పుడు షణ్ముఖ్‌ వెబ్‌ సిరీస్ ప్రకటించడం విశేషం. మొత్తంగా వీరిద్దరు వ్యక్తిగత విషయాలను బయటపడి, కెరీర్‌పై ఫోకస్‌ పెట్టారని చెప్పొచ్చు. ఈ ప్రకటనతో షణ్ముఖ్‌ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ని, షణ్ముఖ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. ఇక షణ్ముఖ్‌.. యూట్యూబ్‌లో వీడియో సాంగ్‌లు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ పాపులర్‌ అయ్యారు. ఆయన నటించిన `ది సాఫ్ట్ వేర్‌ డెవలవ్‌పర్‌` బాగా ఆదరణ పొందింది. దీంతో బాగా పాపులర్‌ అయ్యారు షణ్ముఖ్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా