వరస్ట్ పర్‌ఫెర్మర్‌ అభిజిత్‌.. సభ్యుల ప్రమాణం.. బిగ్‌బాస్‌ షాకింగ్‌ నిర్ణయం

Published : Nov 27, 2020, 11:53 PM ISTUpdated : Nov 27, 2020, 11:56 PM IST
వరస్ట్ పర్‌ఫెర్మర్‌ అభిజిత్‌.. సభ్యుల ప్రమాణం.. బిగ్‌బాస్‌ షాకింగ్‌ నిర్ణయం

సారాంశం

దెయ్యం జలజ అనేసరికి సభ్యులు బిగ్‌బాస్‌ టాస్క్ లు ఇవ్వడం లేదుగా, అని లైట్‌ తీసుకున్నారు. అవినాష్‌, అరియానా, అఖిల్‌, సోహైల్‌ ఏదో మొక్కుబడిగా గేమ్‌ ఆడారు. అభిజిత్‌కి ఆకులను లెక్కపెట్టే టాస్క్ ఇవ్వగా, ఆయన తిరస్కరించాడు.

దెయ్యం జలజతో జరిగిన గేమ్‌లో బిగ్‌బాస్‌ లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ ఇచ్చాడు. ఇందులో సభ్యులెవరూ ఇంట్రెస్టింగ్‌గా గేమ్‌ ఆడలేదు. దెయ్యం జలజ అనేసరికి సభ్యులు బిగ్‌బాస్‌ టాస్క్ లు ఇవ్వడం లేదుగా, అని లైట్‌ తీసుకున్నారు. అవినాష్‌, అరియానా, అఖిల్‌, సోహైల్‌ ఏదో మొక్కుబడిగా గేమ్‌ ఆడారు. అభిజిత్‌కి ఆకులను లెక్కపెట్టే టాస్క్ ఇవ్వగా, ఆయన తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై బిగ్‌బాస్‌ శుక్రవారం ఎపిసోడ్‌లో ఫైర్‌ అయ్యారు. పరోక్షంగా చెత్త ప్రదర్శన ఇచ్చారని తెలిపాడు. 

అంతేకాదు అభిజిత్‌ది వరస్ట్ పర్‌ఫెర్మెన్స్ అని చెప్పాడు. దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పారు. దీంతో అభిజిత్‌, అరియానా, అవినాష్‌ ఇలా ప్రతి ఒక్కరు క్షమాపణలు చెప్పారు. మరోవైపు అరియానా మాట్లాడుతూ, అందరి విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేయకండి అని, తాము బాగానే టాస్క్ లు పూర్తి చేశామని తెలిపింది. సోహైల్‌ స్పందిస్తూ, దీనిపై బిగ్‌బాసే స్పందించి చెప్పాలన్నారు. కానీ బిగ్‌బాస్‌ స్పందించలేదు.

మరోవైపు 12 వారాలు పూర్తి కావస్తున్నాయని, ఫైనల్‌ దగ్గరపడుతుందని చెప్పాడు బిగ్‌బాస్‌. ఇకపై హౌజ్‌కి కెప్టెన్‌ ఉండడని బిగ్‌బాస్‌ తన షాకింగ్‌ నిర్ణయాన్ని వెల్లడించారు. కెప్టెన్సీ బ్యాడ్జ్ కి గౌరవంగా వీడ్కోలు పలకాలని తెలిపాడు. దీంతో సభ్యులు తమదైన స్టయిల్‌లో వీడ్కోలు పలికారు. అనంతరం సభ్యులంతా బిగ్‌బాస్‌కి ప్రమాణం చేశారు. ప్రతి ఒక్కరం కెప్టెన్‌లాగా బాధ్యతగా వ్యవహరిస్తామని, సక్రమంగా నడుచుకుంటామని, హౌజ్‌ని నీట్‌గా ఉండేలా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్