ఇందులో ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ నటి ఒలీవియా మోర్రీస్, రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇందులో చిరంజీవిని కూడా భాగస్వామ్యం చేయించాలని భావిస్తున్నారట రాజమౌళి.
మెగా ఫ్యాన్స్ ఊగిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్`పై హైప్స్ ఆకాశమే హద్దుగా మారుస్తుంది. అదే.. `ఆర్ ఆర్ ఆర్`లోకి మెగాస్టార్ రాబోతుండటం. మరి ఇంతకి చిరంజీవి నటిస్తున్నాడా? ఇంకా ఏదైనా చేస్తున్నాడా? అన్నది చూస్తే, ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ ఆర్ ఆర్` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఇందులో ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ నటి ఒలీవియా మోర్రీస్, రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇందులో చిరంజీవిని కూడా భాగస్వామ్యం చేయించాలని భావిస్తున్నారట రాజమౌళి. బేసిక్‌గా తన సినిమాలకు హైప్ పెంచడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. ఆయన ఈ సినిమాపై హైప్‌ని రెట్టింపు చేసేందుకు మెగాస్టార్‌ని రంగంలోకి దించుతున్నారు. ఈ చిత్రంలో హీరోల పాత్రలను పరిచయం చేసే క్రమంలో వచ్చే వాయిస్ ఓవర్‌ని చిరంజీవితో చెప్పించాలని భావిస్తున్నారట.
రామ్ చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్ర పరిచయానికి, ఎన్టీఆర్ నటిస్తున్న కొమురంభీమ్ పాత్ర పరిచయానికి చిరు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది మున్ముందు క్లారిటీ రానుంది. ఇదే నిజమైతే, ఇక మెగా అభిమానులకు పూనకమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే హిందీ వెర్షన్‌లో వాయిస్ ఓవర్ చెప్పేందుకు అమీర్ ఖాన్‌ని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఒప్పుకున్నారని సమాచారం.