మరోసారి ఏడిపించిన బిగ్‌బాస్‌.. దివి ఎలిమినేట్‌.. అమ్మా కన్నీళ్ళు.. బిగ్‌బాంబ్‌ ఎవరిపై అంటే?

Published : Oct 25, 2020, 11:10 PM IST
మరోసారి ఏడిపించిన బిగ్‌బాస్‌.. దివి ఎలిమినేట్‌.. అమ్మా కన్నీళ్ళు.. బిగ్‌బాంబ్‌ ఎవరిపై అంటే?

సారాంశం

బిగ్‌బాస్‌4, 49వ రోజు దసరా స్పెషల్‌ ఈవెంట్‌లో భాగంగా తమ ఫ్యామిలీ సభ్యుల వీడియోలను చూపించి భావోద్వేగానికి గురయ్యేలా చేశారు. యాభై రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూసుకుని ఇంటిసభ్యులు ఎమోషనల్‌ అయ్యారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు. 

ఇంటిసభ్యులను మరోసారి ఏడిపించాడు బిగ్‌బా. ఆ మధ్య తమ చిన్ననాటి గుర్తులను ఫోటో రూపంలో చూపించి కన్నీళ్ళు పెట్టించారు. అలాగే తమని కదిలించిన సంఘటనలు పంచుకోవాలన్నప్పుడు మరోసారి ఎమోషనల్‌ అయ్యారు సభ్యులు. తాజాగా మరోసారి ఏడిపించాడు. బిగ్‌బాస్‌4, 49వ రోజు దసరా స్పెషల్‌ ఈవెంట్‌లో భాగంగా తమ ఫ్యామిలీ సభ్యుల వీడియోలను చూపించి భావోద్వేగానికి గురయ్యేలా చేశారు. యాభై రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూసుకుని ఇంటిసభ్యులు ఎమోషనల్‌ అయ్యారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు. 

మరోవైపు ఈ వారం ఎలిమినేషన్‌ లేదని అంతా భావించారు. కానీ అందరికి ట్విస్ట్ ఇస్తూ ఎలిమినేషన్‌ ప్రక్రియని చేపట్టింది హోస్ట్ సమంత. ఇందులో ఏడోవారం ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. దసరా స్పెషల్‌ దివికి కలిసి రాలేదనే చెప్పాలి. ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేట్‌ ప్రక్రియలో అరియానా, అభిజిత్‌, మోనాల్‌, నోయల్ సేఫ్‌ అయ్యారు. ఉత్కంఠభరిత గేమ్‌ మధ్య అవినాష్‌, దివి ఎలిమినేట్‌ పోటీ పెట్టారు. ఇద్దరు తాడు లాగినప్పుడు ఎవరిపై ఎరుపు పూలు పడతాయో వారు ఎలిమినేట్‌ అనగా, దివిపై ఎరుపు పూలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా దివికి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. 

దివి ఎలిమినేట్‌ అవుతుందంటే అమ్మా రాజశేఖర్‌ కన్నీళ్ళు పెట్టుకున్నారు. చాలా సేపు ఆయన ఎమోషనల్‌ అయ్యారు. దివి వెళ్తుందంటే తట్టుకోలేకపోయారు. ఆమెకి ఏదో తినిపించాడు. ఈ సందర్భంగా దివి స్పందిస్తూ అమ్మా రాజశేఖర్‌ తనకు అమ్మలాగా అని, తనని హౌజ్‌లో అలా చూసుకున్నారని, చాలా మిస్‌ అవుతున్నట్టు తెలిపింది. దివి పోతూ పోతూ.. లాస్యపై బిగ్‌బాంబ్‌  వేసింది. నెక్ట్స్ వారం మొత్తం వంట చేయాలనేది బిగ్‌బాంబ్‌ కండీషన్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌