బిగ్ బాస్3: ఎలిమినేట్ అయ్యేది వారిద్దరిలో ఒకరే.. దాదాపుగా ఖాయం!

Published : Aug 04, 2019, 12:34 PM IST
బిగ్ బాస్3: ఎలిమినేట్ అయ్యేది వారిద్దరిలో ఒకరే.. దాదాపుగా ఖాయం!

సారాంశం

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఉత్కంఠగా సాగుతోంది. తొలి వారం షో నుంచి నటి హేమ ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండవ వారం అనూహ్యంగా 8మంది సభ్యులు నామినేట్ కావడం విశేషం. శనివారం జరిగిన ఎపిసోడ్ లో నలుగురు సేఫ్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఉత్కంఠగా సాగుతోంది. తొలి వారం షో నుంచి నటి హేమ ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండవవారం అనూహ్యంగా 8మంది సభ్యులు నామినేట్ కావడం విశేషం. శనివారం జరిగిన ఎపిసోడ్ లో నలుగురు సేఫ్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. 

నామినేషన్ లో ఉన్న మహేష్, శ్రీముఖి, హిమజ, రాహుల్ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇక మిగిలింది వరుణ్ సందేశ్, అతడి భార్య వితిక, పునర్నవి, జాఫర్ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆదివారం జరగబోయే ఎపిసోడ్ లో తేలనుంది. కానీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ 3 ఓటింగ్ ట్రెండ్స్, అభిమానులు అంచనాల ప్రకారం వితిక, జాఫర్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వరుణ్ సందేశ్ కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి అతడికి మినహాయింపు లభించవచ్చు. పునర్నవి యువతని ఆకర్షిస్తూ ఓట్లు కొల్లగొడుతోంది. ఓటింగ్ లో వెనుకబడింది వితిక, జాఫర్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. వితిక వరుణ్ సందేశ్ తో కలసి తప్ప విడిగా ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనదు. స్వార్థంగా ఆలోచిస్తుందనే నెగిటివ్ ఒపీనియన్ అభిమానుల్లో క్రియేట్ అయింది. 

ఇక జాఫర్ బిగ్ బాస్ హౌస్ లో అంత యాక్టివ్ గా కనిపించడంలేదు. తరచుగా ఇంటిమీద బెంగతో కనిపిస్తున్నాడు. బాబా భాస్కర్ ని విడిచి ఉండడం లేదు. ఇవన్నీ జాఫర్ పై నెగిటివ్ అంశాలుగా మారాయి. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బోర్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే