బిగ్ బాస్ తో దేవదాస్ కి కొత్త తలనొప్పి!

By Udayavani DhuliFirst Published Sep 20, 2018, 2:21 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న నానిపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం కౌశల్ ఆర్మీ. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో అభిమానులు బాగా పెరిగారు. అతడికోసం కౌశల్ ఆర్మీ తయారైంది. 

బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న నానిపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం కౌశల్ ఆర్మీ. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో అభిమానులు బాగా పెరిగారు. అతడికోసం కౌశల్ ఆర్మీ తయారైంది. ఈ ఆర్మీ హౌస్ లో కౌశల్ ని ఎవరు టార్గెట్ చేస్తున్నా.. వారిపై నెగెటివ్ కామెంట్స్ చేయడం చేస్తున్నారు.

ఆఖరికి హోస్ట్ నానిని కూడా విడిచిపెట్టలేదు. బిగ్ బాస్ ఏం చెప్తే అది చేసే నానిని పట్టుకొని కౌశల్ ఆర్మీ ఇష్టమొచ్చినట్లుగా కామెంట్స్ చేస్తుంది. హౌస్ లో ఎవరేం తప్పులు చేసినా ప్రశ్నించే నాని.. కౌశల్ వంతు వచ్చినప్పుడు కూడా అలానే చేశాడు. దాన్ని తట్టుకోలేని కౌశల్ ఆర్మీ అతడిని బయాస్డ్ అని కొందరికి మాత్రమే సపోర్ట్ చేస్తుంటాడని విమర్శలు చేస్తున్నారు.

ఈ నెగెటివిటీని నాని కూడా తట్టుకోలేకపోతున్నాడు. నిన్న వెన్నెల కిషోర్ పుట్టినరోజు అయితే తనకు విషెస్ చెబుతూ పోస్ట్ చేసిన నాని.. వెన్నెల కిషోర్ ని ట్యాగ్ మాత్రం చేయలేదు. తన కారణంగా వెన్నెల కిషోర్ పై ఎక్కడ నెగెటివ్ కామెంట్స్ వస్తాయోనని భావించి అతడిని ట్యాగ్ చేయలేదు. ఇలా ఇలా ఉండగా.. మరో వారం రోజుల్లో సరిగ్గా బిగ్ బాస్ ఫైనల్స్ కి ముందు నాని నటించిన 'దేవదాస్' సినిమా విడుదల కానుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో నాని వ్యతిరేకులు అతడితో పాటు నాగార్జున, వైజయంతి మూవీస్ ని ట్యాగ్ చేసి మరీ ఈ సినిమా చూడమని చెబుతున్నారు. ఈ సినిమా పైరసీ చేస్తామని, ఫేస్ బుక్ లో వీడియోలు పెడతామని బెదిరిస్తున్నారు. దీంతో సినిమాకు ఎలాంటి నష్టం జరుగుతుందోనని టెన్షన్ పడుతోంది చిత్రబృందం. సినిమాకి హిట్ టాక్ వస్తే ఎలాంటి సమస్య ఉండవు కానీ ఏవరేజ్ టాక్ వచ్చిందంటే ఈ నెగెటివ్ కామెంట్స్ మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. 

click me!