బిగ్ బాస్2: తనీష్ చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు.. కౌశల్ తో శ్యామల చర్చ!

Published : Aug 14, 2018, 06:37 PM ISTUpdated : Sep 09, 2018, 01:39 PM IST
బిగ్ బాస్2: తనీష్ చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు.. కౌశల్ తో శ్యామల చర్చ!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 ఈ వారం నామినేషన్స్ కోసం ఇచ్చిన టాస్క్ ఆసక్తికరంగా నడిచింది. ఒక్కొక్కరిని జంటలుగా ఉండమని చెప్పి వారిలో ఒకరిని ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యే విధంగా టాక్ ఇచ్చారు

బిగ్ బాస్ సీజన్ 2 ఈ వారం నామినేషన్స్ కోసం ఇచ్చిన టాస్క్ ఆసక్తికరంగా నడిచింది. ఒక్కొక్కరిని జంటలుగా ఉండమని చెప్పి వారిలో ఒకరిని ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యే విధంగా టాక్ ఇచ్చారు. ఆ విధంగా ఈ వారం గీతామాధురి, శ్యామల, నూతన్ నాయుడు, రోల్ రైడా, పూజా రామచంద్రన్, దీప్తి సునైనాలు నామినేషన్స్ లో నిలిచారు. నిజానికి ముందుగా ఐదుగురు మాత్రమే నామినేషన్స్ లో ఉండగా, చివరిలో బిగ్ బాస్ కెప్టెన్ అయిన తనీష్ ను ఒకరిని నామినేట్ చేయమని చెప్పగా తను శ్యామల పేరు చెప్పాడు.

మిగిలిన వారంతా తనతో పాటు 63 రోజులు కలిసి ప్రయాణించారని శ్యామల మధ్యలో వెళ్ళిపోయి వచ్చిందని తనను నామినేట్ చేస్తున్నట్లుగా తనీష్ బిగ్ బాస్ కి తెలిపారు. ఆ విధంగా శ్యామల ఈ వారం నామినేషన్స్ లో నిలిచింది. అయితే తనీష్ చెప్పిన కారణం నాకు నచ్చలేదంటూ శ్యామల.. కౌశల్ వద్ద చర్చించింది. 'మీ కారణంగా నేను బయటకి వెళ్లిపోయి మళ్లీ ఏదో వస్తే.. దాన్ని రీజన్ గా చూపించి నామినేట్ చేస్తానంటే ఎలా..?' అంటూ కౌశల్ తో మాట్లాడింది.

అయితే తనీష్ మాత్రం 63 రోజుల పాటు హౌస్ లో ఉండడం మామూలు విషయం కాదని అందుకే శ్యామలని నామినేట్ చేసినట్లుగా దీప్తి సునైనాతో మాట్లాడాడు. దీని బట్టి ఈరోజు షో మరింత ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య