ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కొత్త లుక్.. అచ్చం తండ్రిలానే!

Published : Aug 14, 2018, 05:46 PM ISTUpdated : Sep 09, 2018, 01:39 PM IST
ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కొత్త లుక్.. అచ్చం తండ్రిలానే!

సారాంశం

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి చిత్రబృందం కాషాయ వస్త్రాలలో ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలకృష్ణ ఫోటోను విడుదల చేసింది. ఈ ఫొటోలో బాలయ్య అచ్చం తన తండ్రిలానే అనిపిస్తున్నారు

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో అతని కుమారుడు నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ తీయాలని నిర్ణయించుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ రూపొందుతోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. ఎన్టీఆర్ ని ఈ సినిమాలో మూడు దశల్లో చూపించనున్నారు.

తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ కొత్త గెటప్ ను విడుదల చేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి చిత్రబృందం కాషాయ వస్త్రాలలో ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలకృష్ణ ఫోటోను విడుదల చేసింది. ఈ ఫొటోలో బాలయ్య అచ్చం తన తండ్రిలానే అనిపిస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత ఎన్టీఆర్ ఎక్కువగా కాషాయ వస్త్రాలనే ధరించేవారు.

దీనికి సంబంధించిన గెటప్ లో బాలయ్య ఇమిడిపోయారనే చెప్పాలి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విద్యాబాలన్, రానా, సుమంత్ వంటి నటులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?