బిగ్ బాస్2: పిచ్చా.. కౌశల్ పై తనీష్ కామెంట్స్!

Published : Sep 18, 2018, 11:28 AM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
బిగ్ బాస్2: పిచ్చా.. కౌశల్ పై తనీష్ కామెంట్స్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్2.. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకునేసరికి హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంతిమ యుద్ధంలో కౌశల్, తనీష్, రోల్ రైడా, సామ్రాట్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు పోటీ పడుతున్నారు. 

బిగ్ బాస్ సీజన్2.. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకునేసరికి హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంతిమ యుద్ధంలో కౌశల్, తనీష్, రోల్ రైడా, సామ్రాట్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు పోటీ పడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈరోజు ఎపిసోడ్ లో కూడా గొడవలు ఆగేలా కనిపించడం లేదు. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ ఇచ్చాడు. అదే 'మీ ఇసుక జాగ్రత్త'. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ ఇచ్చిన ఇసుకను ఫైనల్ బజర్ మోగే వరకు జాగ్రత్తగా ఉంచాలి.

ఈ క్రమంలో కౌశల్ మిగిలిన కంటెస్టెంట్స్ ఇసుకపై దాడి చేస్తూ నేలపాలు చేసే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా తనీష్ ఇసుకను కూడా కింద పడేస్తుండగా అతడు కౌశల్ పై తిరగబడ్డాడు. ఒకరినొకరు తోసుకుంటూ గొడవకి దిగారు. పిచ్చా.. అంటూ తనీష్.. కౌశల్ ని అనడంతో వెంటనే కౌశల్ గొడవకి దిగారు.

ఇద్దరూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండడం ప్రోమోలో కనిపిస్తుంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్