బిగ్ బాస్2: మీరు చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేసేది మరొకటా..? కౌశల్ పై గీతామాధురి ఫైర్!

Published : Aug 16, 2018, 11:53 AM ISTUpdated : Sep 09, 2018, 10:58 AM IST
బిగ్ బాస్2: మీరు చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేసేది మరొకటా..? కౌశల్ పై గీతామాధురి ఫైర్!

సారాంశం

మీరు చేసేది సంసారం.. వేరే వాళ్లు చేసేది మరొకటి అన్నట్లుగా మీరు మాట్లాడొద్దు. మీ మీద నాకు ఒపీనియన్ మారుతోంది

బిగ్ బాస్ సీజన్ 2 లో ప్రస్తుతం 'కాల్ సెంటర్' టాస్క్ నడుస్తోంది. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ టాస్క్ ఎన్నో వివాదాలకు దారి తీసింది. కాల్ సెంటర్ ఉద్యోగులు, పబ్లిక్ కాలర్స్ ఇలా రెండు టీమ్ లుగా విడిపోయి హౌస్ మేట్స్ ఈ టాస్క్ ని పూర్తి చేయాలి. ఈ క్రమంలో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు కౌశల్ పై గీతామాధురి, దీప్తి సునైనాలు ఫైర్ అయ్యారు. కౌశల్ అయితే దీప్తి సునైనాను వ్యక్తిగతంగా దూషిస్తూ కామెంట్స్ చేశారు.

నిన్నటి ఎపిసోడ్ లో గణేష్.. కౌశల్ పై విరుచుకుపడ్డారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో పబ్లిక్ కాలర్స్ గా ఉన్న టీమ్ కాల్ సెంటర్ ఉద్యోగులుగా మారనున్నారు. ఈ క్రమంలో కౌశల్, పూజా రామచంద్రన్, గీతా మాధురిల మధ్య చిన్న డిస్కషన్ జరిగింది. కౌశల్ టాస్క్ లో తను చేసేది కరెక్ట్ అని సమర్ధించుకుంటూ రోల్ రైడాను తప్పుబట్టారు.

దీంతో గీతామాధురి.. కౌశల్ ని 'మీరు చేసేది సంసారం.. వేరే వాళ్లు చేసేది మరొకటి అన్నట్లుగా మీరు మాట్లాడొద్దు. మీ మీద నాకు ఒపీనియన్ మారుతోంది' అంటూ ఘాటుగా స్పందించింది. దీన్నిబట్టి ఈరోజు షో మరింత ఇంట్రెస్టింగ్ గా సాగనుందని తెలుస్తోంది.   

 

PREV
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు