బిగ్ బాస్2: సునైనాతో విజయ్ దేవరకొండ ఏం చేయించాడంటే!

By Udayavani DhuliFirst Published Aug 19, 2018, 7:55 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 70 ఎపిసోడ్లు పూర్తి కావడంతో హౌస్ లో కాంపిటీషన్ పెరిగిపోయింది. బుల్లితెర ప్రేక్షకులకు చేరువ కావడం కోసం ఈ షో సినిమా ప్రమోషన్స్ కి వేదికగా మారింది

బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 70 ఎపిసోడ్లు పూర్తి కావడంతో హౌస్ లో కాంపిటీషన్ పెరిగిపోయింది. బుల్లితెర ప్రేక్షకులకు చేరువ కావడం కోసం ఈ షో సినిమా ప్రమోషన్స్ కి వేదికగా మారింది. ఈరోజు ఎపిసోడ్ లో హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారు.

విజయ్ నటించిన 'గీత గోవిందం' సినిమా ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ తో కలిసి హీరో విజయ్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో నానితో కలిసి విజయ్.. సునైనాని ఓ ఆట ఆడుకున్నారు. సీక్రెట్ గా ఫన్నీ టాస్క్ లు ఇచ్చి ఆడించారు.

'మీ అక్క పెళ్లి గురించి ఎమోషన్ అవుతున్నట్టు నటించు. కొడుకు కూడా పుట్టేశాడని చెప్పు' అనడంతో సునయన అలానే నటించింది. దీంతో అదంతా నమ్మేసిన రోల్.. సునైనాను దగ్గరకు తీసుకొని హగ్ ఇవ్వడంతో అందరూ నీకే హగ్ లు ఇస్తారా..? అంటూ పంచ్ వేశాడు. రోల్ రైడా నెత్తిన లడ్డూ కొట్టమని, నిద్రపోతున్న అమిత్ పై నీళ్లు పోయమని చెప్పడంతో అంతా ఫన్నీగా సాగింది. 

click me!