బిగ్ బాస్ విన్నర్ రేవంత్ కూతురిని చూశారా? చందమామ కంటే అందంగా ఉంది కదా!

Published : Jan 17, 2023, 07:28 AM ISTUpdated : Jan 17, 2023, 07:44 AM IST
బిగ్ బాస్ విన్నర్ రేవంత్ కూతురిని చూశారా? చందమామ కంటే అందంగా ఉంది కదా!

సారాంశం

బిగ్ బాస్ విన్నర్ రేవంత్ కూతురు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రేవంత్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కూతురితో జరుపుకున్న భోగి పండుగ వీడియో షేర్ చేశారు.   

సింగర్ రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss Telugu 6) విన్నర్ గా అవతరించిన విషయం తెలిసిందే. తన నమ్మకమే రేవంత్ ని గెలిపించింది. కచ్చితంగా టైటిల్ నాదే అని ఫిక్స్ అయిన రేవంత్ నాగార్జున ప్రలోభాలకు లొంగలేదు. అదే సమయంలో శ్రీహాన్ విశ్వాసం కోల్పోయి టైటిల్ చేజార్చుకున్నాడు. ఓట్ల ద్వారా టైటిల్ విన్నర్ అయిన శ్రీహాన్ రూ. 40 లక్షల ఆఫర్ తీసుకోవడం వలన అద్భుతమైన అవకాశం కోల్పోయాడు. శ్రీహాన్ డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకోవడంతో రేవంత్ విన్నర్ అయ్యాడు. 

ఏది ఏమైనా రేవంత్(Revanth) టైటిల్ అందుకొని బిగ్ బాస్ తెలుగు 6 విన్నర్ గా రికార్డులకు ఎక్కాడు. కాగా రోజుల వ్యవధిలో రేవంత్ కి రెండు అరుదైన బహుమతులు అందాయి. ఒకటి బిగ్ బాస్ టైటిల్ కాగా, మరొక బహుమతి అందమైన బుజ్జాయి. రేవంత్ హౌస్లో ఉండగా భార్య ప్రసవించింది. బిగ్ బాస్ షోకి వెళ్లే నాటికి రేవంత్ వైఫ్ గర్భవతిగా ఉన్నారు. కూతురు పుట్టిన విషయాన్ని రేవంత్ కి బిగ్ బాస్ చెప్పాడు. దీంతో రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. 

టైటిల్ సాధించి నా కూతురికి బహుమతిగా ఇస్తానని చెప్పాడు. చెప్పినట్లే రేవంత్ టైటిల్ గెలిచాడు, తన పాపకు గిఫ్ట్ గా ఇచ్చాడు. రేపు ఆ పాప పెద్దయ్యాక రేవంత్ ఈ విషయాన్ని చాలా స్పెషల్ గా ఆమెతో పంచుకోవచ్చు. ఇక రేవంత్ పాపాయి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భోగిపండుగ నాడు పాపకు భోగిపళ్ల వేడుక చేశాడు. ఈ వీడియో రేవంత్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.  రేవంత్ కూతురిని చూసిన ఆయన ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్మెంట్ ఫీలవుతున్నారు. పాప చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

కాగా టాలీవుడ్ స్టార్ సింగర్స్ లో ఒకడిగా రేవంత్ ఉన్నాడు. ఈయన ఇండియన్ ఐడల్ గెలుచుకోవడం విశేషం. రేవంత్ కంటూ ఓ అభిమానవర్గం ఉంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా రేవంత్ ఇమేజ్ మరింత పెరిగింది. అయితే హౌస్లో రేవంత్ ప్రవర్తన వివాదాస్పదమైంది. అతని దుందుడుకు స్వభావం పై విమర్శలు వెల్లువెత్తాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

The Raja Saab 6 Days Collection: ది రాజాసాబ్‌కి ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు.. ప్రభాస్‌ టార్గెట్‌కి ఎంత దూరంలో ఉన్నాడంటే
BMW vs Anaganaga Oka Raju: రవితేజకి నవీన్‌ పొలిశెట్టి బిగ్‌ షాక్‌.. `అనగనగా ఒక రాజు`కి ఊహించని కలెక్షన్లు