బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలు.. బోట్ లో వెళుతుండాగా ప్రమాదం

By team teluguFirst Published Jan 16, 2023, 8:16 PM IST
Highlights

విజయ్ ఆంటోని తన తదుపరి చిత్ర షూటింగ్ లో ప్రమాదవశాత్తూ తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ ఆంటోని ప్రస్తుతం బిచ్చగాడు 2(పిచైక్కారన్ 2)  చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. 

సైలెంట్ గా వచ్చిన బిచ్చగాడు చిత్రం తెలుగు తమిళ భాషల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్ వచ్చింది. అంతకు ముందు విజయ్ కొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ విజయ్ ఆంటోని అంటే ఎవరో చాలా మందికి తెలియదు. బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోని ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. 

అయితే ఈ క్రేజీ హీరోకి తాజాగా ఓ దురదృష్ట సంఘటన జరిగింది. విజయ్ ఆంటోని తన తదుపరి చిత్ర షూటింగ్ లో ప్రమాదవశాత్తూ తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ ఆంటోని ప్రస్తుతం బిచ్చగాడు 2(పిచైక్కారన్ 2)  చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. 

షూటింగ్ జరుగుతుండగా విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డారు. దీనితో చిత్ర యూనిట్ అతడిని మలేషియాలో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ కండిషన్ స్టేబుల్ గా ఉందట. కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ రోజు రాత్రికి విజయ్ ఆంటోని ఫ్యామిలీ మలేషియాకు పయనం కాబోతున్నట్లు తమిళ వర్గాలు చెబుతున్నాయి. 

బోట్ లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయ్ బోట్ లో ప్రయాణిస్తూ నటిస్తున్నాడు. పక్కనే వేరే పడవలో కెమెరామెన్, ఇతర సిబ్బంది చిత్రీకరిస్తున్నారు. వేగంగా ప్రయాణిస్తున్న బోట్ అదుపు తప్పి పడవని ఢీకొట్టిందట. దీనితో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 

విజయ్ ఆంటోని ఎప్పటికి పూర్తిగా కోలుకుంటాడు.. బిచ్చగాడు 2 షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందో క్లారిటీ లేదు. అభిమానులు విజయ్ ఆంటోని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 

click me!