BiggBoss7: ఏం పీక్కుంటారో పీక్కోమను, రతికకి శివాజీ సలహా.. ప్రశాంత్ ని వదలలేక పోతోందా.. 

Published : Sep 19, 2023, 10:23 PM ISTUpdated : Sep 19, 2023, 10:24 PM IST
BiggBoss7: ఏం పీక్కుంటారో పీక్కోమను, రతికకి శివాజీ సలహా.. ప్రశాంత్ ని వదలలేక పోతోందా.. 

సారాంశం

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 7 షోలో ప్రస్తుతం పవర్ అస్త్రాలు వేట సాగుతోంది. ఈ వారం మూడవ పవర్ అస్త్ర టాస్క్ లు జరగబోతున్నాయి.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 7 షోలో ప్రస్తుతం పవర్ అస్త్రాలు వేట సాగుతోంది. ఈ వారం మూడవ పవర్ అస్త్ర టాస్క్ లు జరగబోతున్నాయి. నేటి ఎపిసోడ్ మంగళవారం రోజు మూడవ పవర్ అస్త్రకి సంబంధించిన అంశంలో కీలక ప్రక్రియ మొదలయింది. బిగ్ బాస్ కంటెండర్స్ ని ఎంపిక చేశారు. 

శివాజీ, రతిక గుసగుసల తో నేటి ఎపిసోడ్ మొదలైంది. అంతా నాగురించే చెడుగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా నా ఎక్స్ గురించి అంటూ రతిక శివాజీ వద్ద వాపోయింది. అలా మాట్లాడే వారిని ఏం పీక్కుంటారో పీక్కోమను. మనం వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదు. స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ శివాజీ రతికకి సలహా ఇచ్చారు. 

అలాగే బిగ్ బాస్ హౌస్ లో వినాయక చవితి సెలెబ్రేషన్స్ జరిగాయి. అనంతరం బిగ్ బాస్ మూడవ పవర్ అస్త్ర కంటెండర్స్ గా అర్హత సాధించిన వారి పేర్లని ప్రకటించారు. తన పరిశీలన ద్వారా ఇన్ని రోజుల ఆట ద్వారా కంటెండర్స్ ని ఎంపిక చేసినట్లు బిగ్ బాస్ తెలిపారు. అమర్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ మూడవ పవర్ అస్త్ర కంటెండర్స్ గా నిలిచినట్లు ప్రకటించారు. 

తనకి కంటెండర్ గా అవకాశం రాకపోవడంతో ప్రశాంత్ కన్నీరు మున్నీరుగా ఏడ్చేశాడు. బిగ్ బాస్ గెలుస్తానని నమ్మకం పోయినట్లు బిగ్ బాస్ ముందు వాపోయాడు. దీనితో బిగ్ బాస్ ప్రశాంత్ ని పిలిచి ప్రకటించిన ముగ్గురిలో కంటెండర్ గా అర్హత లేనిది ఎవరికి అని నీవు భావిస్తున్నావు అని ప్రశ్నించాడు. దీనితో ప్రశాంత్ శోభా శెట్టి పేరు చెప్పాడు. ప్రియాంక.. అమర్ డీప్ పేరు చెప్పింది. తేజ, దామిని, రతిక.. యావర్ కి కంటెండర్ గా అర్హత లేదని తమ అభిప్రాయాన్ని బిగ్ బాస్ కి తెలిపారు. 

ఆ తర్వాత చిన్న విషయంలో రతిక, ప్రశాంత్ మధ్య వచ్చిన గొడవ హౌస్ లో ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇద్దరూ కాసేపు తిట్ల పురాణం అందుకుని ఒకరిని ఒకరు దూషించుకున్నారు. చూస్తుంటే వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండేలా లేరు అనిపిస్తోంది. నువ్వు దొబ్బెయ్ అంటే నువ్వే దొబ్బెయ్ అంటూ ప్రశాంత్, రతిక తిట్టుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌