బిగ్ బాస్ 7 మొదటి వారం పూర్తైంది. ఫస్ట్ వీక్ లో నటి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్ ఎపిసోడ్ మొత్తం చాలా ట్విస్టులతో, ఆసక్తికరంగా సాగింది. కిరణ్ కు కంటెస్టెంట్లు వీడ్కోలు పలికారు. ఈక్రమంలో రేపటి ఎపిసోడ్ పై మరింత ఆసక్తిని పెంచారు.
బిగ్ బాస్ 7 మొదటి వారం పూర్తైంది. ఈ ఎపిసోడ్ లో ఎంత సరదాగా ఉన్నారో.. బిగ్ బాస్ అన్ని ట్విస్టులు ఇచ్చారు. పవర్ అస్త్ర దక్కించుకున్న ఆట సందీప్ కు బిగ్ షాకిచ్చి తన వ్యక్తిత్వాన్ని పరిశీలించారు. ముందు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చి ఆ తర్వాత షాక్ లు ఇస్తుండటం షోపై ఆసక్తిని పెచింది. పవర్ అస్త్రను ఎవరికైనా డెడికేట్ చేస్తే దాని వల్ల కలిగే ఉపయోగాలు వర్తించవని బిగ్ బాస్ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. అయినా సరే అంటూ ఆట సందీప్ తన కొడుకు దాన్ని డెడికేట్ చేయడం, ఎంతకూ మాట మార్చకపోవడంతో నాగ్ అతన్ని అభినందించాడు. జోక్ చేశానంటూ పవర్ అస్త్ర ఉపయోగాలన్నీ ఉంటాయన్నారు.
పవర్ అస్త్రలోని మొదటి ఉపయోగంలో సందీప్ ఫస్ట్ కంటెస్టెంట్ గా కన్ఫమ్ కావడంతో పాటు హౌజ్ లోని వీఐపీ రూమ్ లోకి సందీప్ ఇచ్చాడు. ప్రస్తుతానికి అందులో ఉన్న బెడ్స్ అన్నీటిపై ఆయనకే అర్హత ఉంది. అలాగే ఐదువారాల పాటు ఇమ్యూనిటీని కూడా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సరదా ఓ గేమ్ ఆడించిన బిగ్ బాస్ గేమ్ ను ముందుకు తీసుకెళ్లాడు.
undefined
ఈ వారం ఒకరు ఎలిమేనేట్ కావాల్సి ఉండటంతో గేమ్ మొదలెట్టారు. మొదట నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మంది పిలిచారు. వారందరికీ బాక్సులు అందజేశారు. అందులో అస్థిపంజరం ఉంటే నాట్ సేఫ్ అని, గులాబీ రేకులు ఉంటే సేఫ్ అని ముందే చెప్పారు. ఈ నామినేషన్ లో ఉన్న కిరణ్, పల్లవి ప్రశాంత్ , దామిని, శోభాశ్రీ (సేఫ్), యావర్, గౌతమ్ కృష్ణ, షకీలా, రతికా (సేఫ్)లో ఇద్దరు సేఫ్ అయ్యారు. శోభాశ్రీ, రతికా సేఫ్ అయ్యారు.
ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్ల మధ్య ఉన్నమనస్పార్థాలను తొలగించేందుకు ‘లైక్, క్రాస్’ సింబల్స్ దగ్గర కంటెస్టెంట్స్ గుర్తుపెట్టుకునే అంశం.. మర్చిపోయే ఘటనపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే తొలి అనుభవాన్ని పంచుకోవాలని సూచించారు. తొలుత రతికా మాట్లాడుతూ శివాజీ తనకు అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పింది. ఇక మర్చిపోవాల్సిన వ్యక్తిగా సందీప్ ను తెలియజేయడం విశేషం. అలాగే శివాజీ తనకు నచ్చిన వ్యక్తి పల్లవి ప్రశాంత్ అని చెప్పారు. అలాగే అమర్ తనకు మర్చిపోతున్న వ్యక్తిగా తెలిపారు. అమర్ దీప్ ను తనను నామినేట్ చేయడం ఏమాత్రం నచ్చలేదని చెప్పారు.
పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ.. కుస్తీ పోటీల్లో శివాజీ తనకు మద్దతు ఇచ్చారని, హౌజ్ లో తనకు ధైర్యం ఇచ్చారని చెప్పారు. ఇక మర్చిపోవాలనే విషయంలో షకీలాతో జరిగిన ఘటనను మర్చిపోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇక షకీలా మాట్లాడుతూ కిరణ్ తనను హౌజ్ లోకి రాగానే గుర్తుండిపోయేలా పలకరించిందని చెప్పింది. యావర్ కిరణ్ తో బాగా కలిసిపోయానని చెప్పారు. ఆట సందీప్ గుర్తుపెట్టుకునే మూమెంట్ తో షకీలాతో ఉందని, మర్చిపోయే మూమెంట్ యావర్ తో ఉందని చెప్పారు. యావర్ ను తన బెస్ట్ ఫ్రెండ్ గా ఫీల్ అవుతున్నట్టు తెలిపారు.
ఇక దామిని మాత్రం రతికా టగ్ కంట్రోల్ లో ఉండాలంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టేస్టీ తేజాకు ఎలుకల మందు పెడ్తానని షకీలా ఫన్నీ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత శోభాశ్రీ మాట్లాడుతూ టేస్టీతేజాను మెచ్చుకుంది. దీంతో బిగ్ బాస్ ఆమెకు ఊహించిన ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికే ఆమె టాయిలెట్స్ శుభ్రం చేసే పనిని స్వీకరించగా.. అందులో తేజానూ తీసుకోవచ్చని, కావాలంటే సూపర్ వైజ్ కూడా చేయొచ్చని బిగ్ బాస్ సపోర్ట్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. మిగిలిన ఆరుగురిని నామేషన్ కు పిలిచారు. అందరికీ పౌచ్ లు అందించి స్కోర్ బోర్డులు ఇచ్చారు. ఇందులో దామిని (81), గౌతమ్ కృష (88), యావర్ (76), షకీలా (85), కిరణ్ (64), పల్లవి ప్రశాంత్ (93) స్కోర్ చేశారు. అత్యధిక స్కోర్ చేసిన ఇద్దరిని సేఫ్ గా ప్రకటించారు. దీంతో పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ సేఫ్ అయ్యారు. మిగిలిన నలుగురిలో యావర్, కిరణ్ లాస్ట్ లో ఉన్నారు. వీరిద్దరిలో కిరణ్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ 7 నుంచి మొట్టమొదటి కంటెస్టెంట్ గా హౌజ్ ను వీడింది.
కిరణ్ రాథోడ్ హౌజ్ ను వీడుతుండటంతో కంటెస్టెంట్లకు చివరిగా బాయ్ చెప్పింది. అలాగే నెక్ట్స్ వీక్ ఎలిమినేషన్ లో సందీప్ ను హౌజ్ నుంచి పంపించేందుకు జరిగిన టాస్క్ మరింత ఆసక్తికరంగా ఉంది. రేపటి ఎపిసోడ్ లో దానికి సంబంధించిన డిటేయిల్స్ అందనున్నాయి.