Bigg Boss Telugu 7: అమర్ దీప్ కు అనారోగ్యం..? హౌస్ నుంచి బయటకు రాబోతున్నాడా..?

Published : Nov 23, 2023, 01:01 PM ISTUpdated : Nov 23, 2023, 01:04 PM IST
Bigg Boss Telugu 7: అమర్ దీప్ కు అనారోగ్యం..? హౌస్ నుంచి బయటకు రాబోతున్నాడా..?

సారాంశం

గత సీజన్ల కంటే ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7. కంటెస్టెంట్ నుంచి నవరసాలను బయటు తీస్తున్నాడు బిగ్ బాస్. ఈక్రమంలో హౌస్ లో టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరైన అమర్ దీప్ అనారోగ్యం పాలయినట్టు తెలుస్తోంది.   

బిగ్ బాస్ హౌస్ మునిపటికంటే ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. గత సీజన్లు డల్ అవ్వడంతో.. ఈసారి కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారుమేకర్స్.. ఈక్రమంలో కంటెస్టెంట్స్ విషయంలో పెద్దగా మార్పులు లేకపోయినా.. కంటెంట్ విషయంలో మాత్రం బాగా మార్పులు చేశారు. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ సమాచారంప్రకారం కంటెస్టెంట్ గా ఉన్న అమర్ దీప్ కు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినట్టు తెలుస్తోంది. నిన్ననే టాస్క్ లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు అమర్ దీప్. బిగ్ బాస్ హౌస్ లో కిల్లర్ టాస్క్ నడుస్తోంది. అమర్ ఈ టాస్క్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నాడు. ఈక్రమంలో ఆయన ఒక్కసారిగా అనారోగ్యం పాలు అయినట్టు సమాచారం. 

ప్రస్తుతం బిగ్ బాస్ మెడికల్ రూమ్ లో అమర్ కు ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఆయనకు సెలైన్ కూడా ఎక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అతను హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడన్న ప్రచారం కూడా సాగుతోంది. అమర్ ఆరోగ్యం కుదుట పడకపోతే బయటకు పంపిస్తారా అన్న చర్చలు బయట జోరుగా సాగుతున్నాయి. కాని ఇంత వరకూ బిగ్ బాస్ నుంచి అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే.. ఈరోజు ఎపిసోడ్ చూస్తే కాని అర్ధం అవ్వదు. 

Bigg Boss Telugu 7: ప్రశాంత్ ను బకరాను చేసి బలి చేసిన శివాజీ, రహస్యంగాప్రేమించుకుంటున్న గౌతమ్- రతిక

బుల్లి తెరపై హీరోగా కొనసాగుతున్నాడు అమర్ దీప్. జానకి కలగనలేదు సీరియల్‏లో రామా పాత్రతో తెలుగువారి మనసుకు దగ్గరయ్యాడు.  తన నటనతో మంచి ఫాలోయింగ్ కూడా సాధించాడు అమర్. ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ లోకి వెళ్లిన అమర్ .. హౌస్ లో మాత్రం స్ట్రాంగ్ గా ఉండలేకపోతున్నాడు. ఉన్న పళంగా ఆయన ఎలిమినేట్ అయ్యేది లేదు కాని.. ప్రతీ టాస్క్ లో టార్గెట్ అవుతూ.. నోరు జారుతూ.సీరియల్ బ్యాచ్‏తో స్నేహం.. ఎదుటివాళ్ల కోసం తన గేమ్ కోసం తన ఆటను పక్కనపెట్టేశాడు. అనవసర విషయాల్లో కలగజేసుకుని అర్థంలేని వాదనతో రోజు రోజుకీ తన గ్రాఫ్ తగ్గించుకున్నాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ విషయంలో అమర్ దీప్ ప్రవర్తించిన తీరుతో పూర్తిగా నెగిటివిటీ సంపాదించుకున్నాడు. 

బాలయ్యపై పగబట్టిన హీరోయిన్లు, అప్పుడు రాధికా ఆప్టే, ఇప్పుడు విచిత్ర.. ఆరోపణల్లో నిజంఎంత...?

అమర్ పై మొన్నటి వరకూ..  సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. అయితే ఈవారం మాత్రం అమర్ దీప్ తన ఆట తీరును పూర్తిగా మార్చేశాడు. సైలెంట్‏గా ఉంటూనే తన గేమ్ పై ఫోకస్ పెట్టాడు. ముఖ్యంగా శివాజీతో క్లోజ్ గా ఉంటూ టాస్కులలో 100 శాతం ఆడేందుకు ట్రై చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు అమర్ దీప్‏కు ఓటింగ్ కూడా ఎక్కువే అయ్యింది. మరి అమర్ అనారోగ్యం వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. అంతే కాదు.. 80 రోజులు హౌస్ లో ఉన్న అమార్.. టాప్ 5 లోకి వెళ్ళడం పక్కా అంటున్నారు. మరి విన్నర్ గానో.. రన్నర్ గానో అమర్ సాధించగలడా.. ? చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు