
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రాను రాను రసవత్తరంగా సాగుతోంది. జనాలు తగ్గే కొద్ది.. ఆట ఇంట్రెస్టింగ్ గా తయారవుతుంది. లాస్ట్ వీక్ టాప్ 5 గురించి నాగ్ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించగా..ఈరోజు ఎపిసోడ్ లో నామీనేషన్ల ఘట్టం డిఫరెంట్ గా సాగింది. ప్రతీ సారి గొడవలు, కొట్లాటలతో.. హోరా హోరీగా సాగిననామినేషన్ల ప్రక్రియ .. ఈ సారి ఎవరికి సబంధం లేదు అన్నట్టుగా.. సీక్రేట్ రూమ్ లో జరిగింది. ప్రతీ ఒక్కరకు తాముఇంటి నుంచి బయకు పంపించాలి అనుకుంటున్నవారిని, రీజన్స్ చెప్పి మరీ రూమ్ లో నామినేట్ చేశారు.
అయితే ఈసారి హౌస్ అంతా శ్రీహాన్ ను టార్గెట్ చేసినట్టు అనిపించింది. ముఖ్యంగా కీర్తి,రోహిత్, రాజ్ లు శ్రీహాన్ పై బలమైన కారణాలతో నామినేట్ చేశారు. ఆదిరెడ్డితో పాటుగా శ్రీహాన్ ను నలుగురు నామినేట్ చేయగా.... రోహిత్, ఫైమాను 3 నామినేట్ చేశారు. రాజ్, ఆదిరెడ్డి, ఇనయా, ఆదిరెడ్డి రెండ రెండు ఓట్లతో నామినేట్ అయ్యారు. కెప్టెన్ కనుక రేవంత్ సేవ్ అవ్వగా.. కీర్తీ ఒక్కరేనామినేట్ చేయడంతో.. సేవ్ అయ్యింది. అటు శ్రీహాన్ నాలుగు ఓట్లుపడటంతో.. బాగా ఫీల్ అయ్యాడు. ఎందుకు నన్ను శత్రువుల్లా చూస్తున్నారంటూ బాధపడ్డాడు.
ఇక హౌస్ లో ఉన్నవారికిబయట నుంచి కొన్నిమెసేజ్ లు రాగా.. ఈసారి శ్రీసత్య, రాజ్, కీర్తీ, ఇనయా లకుమెసేజ్ లు వచ్చాయి. ఇక కీర్తీ సింపతీ కోసం ఆరాటపడుతున్నారా అనిఅడగ్గా.. సింపతీ ఎప్పటికీ పనిచేయదని కీర్త బదులిచ్చింది. రాజ్ నునీ వెనకాల నీ గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారుఅని అనుకుంటున్నాు అని అనగా.. రాజ్ సరదాగా ఇనయా పేరు చెకప్పాడు. దాంతో కన్నీల్లు పెట్టుకుంది ఇనయా. ఇక హౌస్ కెప్టెన్ కమ్.. రేషన్ మేనేజర్ రేవంత్ ను బంగాళ దుప కావాలి అని అడిగి కీర్తీ ఓ చిన్నపాటి గోడవ పెట్టుకుంది.
ఇక అర్ధరాత్రి రాజ్ ను భయపెట్టాలని శ్రీసత్య, ఫైమా మేకప్ వేసుకుని ప్లాన్ చేసుకున్నారు. శ్రీసత్య ను చూసి రాజ్ కాస్త ఉల్లిక్కి పడ్డాడు కాని భయపడలేదు. ఇక శ్రీసత్య శ్రీహాన్ బెడ్ మీదకు వెళ్లి భయపెట్టింది. ఈ రకంగా హౌస్ లో అర్ధరాత్రి కాస్త నవ్వులు పూసాయి. రేపు కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి గేమ్ ఇంకాస్త టఫ్ గా మారే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి బరిలో నిలిచేది ఎవరు..గెలిచేది ఎవరు అని.