బిగ్ బాస్ తెలుగు 9 షో రోజు రోజుకీ రసవత్తరంగా మారుతోంది. హౌస్ లో మూడవరోజుకి సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ తెలుసుకుందాం.

01:08 PM (IST) Sep 10
Bigg Boss Telugu 9 promo: బిగ్‌బాస్ లో మొదటి వారం నామినేషన్లు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. కామనర్లు, సెలబ్రిటీలు ఇద్దరూ వ్యూహాత్మకంగా నామినేట్ చేస్తూ గేమ్‌ను హీటెక్కించారు. నామినేషన్స్ టాస్క్‌లో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ సర్వైవల్ కోసం స్ట్రాటజీ గేమ్స్, మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. తాజాగా “చదరంగం అయినా, రణరంగం అయినా… సర్వైవల్‌కి స్ట్రాటజీ మాత్రమే వెపన్” అంటూ విడుదల చేసిన తాజా ప్రోమో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
01:05 PM (IST) Sep 10
ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో విషయంలో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైనట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
06:29 AM (IST) Sep 10
బిగ్ బాస్ హౌస్ లో సంజన గల్రానీ టార్గెట్ గా మారారు. ఆమె అబద్దాలు చెబుతోందని, బ్యాడ్ బిచ్చింగ్ చేస్తోందని ఇతర హౌస్ మేట్స్ ఆమెని నిందించడం మొదలు పెట్టారు. హౌస్ లో ప్రియా, సంజన .. సంజన, ఫ్లోరా షైనీ మధ్య హైడ్రామా సాగింది. చూస్తుంటే ఈ గొడవలు మరింత ఎక్కువయ్యేలా ఉన్నాయి.