‘బిగ్ బాస్ 7’ హౌజ్ లో వినిపించే వాయిస్ ఎవరిదో తెలుసా? ఆయన డిటేయిల్స్

పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’  ఏడో సీజన్ ప్రస్తుతం ఆసక్తికరంగా కొనసాగుతోంది. అయితే హౌజ్ లో ఎలాంటి సూచనలు చేయాలన్న ఓ వాయిస్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ మాటలు ఎవరివి? డబ్బింగ్ చెప్పేది ఎవరు? 
 

Google News Follow Us

పాపులర్ రియాలిటీ షో Bigg Boss భారతీయ ప్రధాన భాషల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతటా మంచి రేటింగ్ ను దక్కించుకుంది. ఇక తెలుగులోనూ ఈషోకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. సెలబ్రెటీలతో రన్ అవుతుండటంతో ప్రతిరోజూ హౌజ్ లో జరిగే విషయాలపై ఆడియెన్స్. ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.
 
అయితే హౌజ్ లోకి వచ్చే రకరకాల వ్యక్తులను కంట్రోల్ చేయాలంటే ఓ గంభీరమైన గొంతు అవసరం. అయితే, హౌజ్ లో సూచనలు, ఆదేశాలిస్తూ వినిపించే గంభీరమైన గొంతు ఎవరిదనేది చాలా మందికి తెలిసి ఉండదు. ఆ వాయిస్ కు అసలు ఓనర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శంకర్ (Shankar). వరుసగా ఆరుసీజన్లకు ఆయనే వాయిస్ అందించారు. ఆ గంభీరమైన గొంతుకు ఆడియెన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు.

శంకర్ ‘బిగ్ బాస్’కు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు టఫ్ కాంపీటిషన్ నే ఎదర్కొన్నాడు. షో ప్రారంభంలో ఏకంగా 100 మంది వరకు ఆడిషన్ ఇచ్చారు. అందులో శంకర్ పేరు ఫైనల్ అయ్యింది. ఆయన గంభీరమైన గొంతు నచ్చే అవకాశం ఇచ్చారంట. ఇక ప్రస్తుతం ఆ వాయిస్ రోజుకు పదిసార్లైనా హౌజ్ లో వినిపిస్తూనే ఉంది. బయట చాలా మంది ఇమిటేట్ కూడా చేస్తున్నారు. 

ఇక Bigg Boss Telugu రియాలిటీలో షోలో ఈసారి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్ తో అలరిస్తంది. BB7 Telugu సెప్టెంబర్ 3న గ్రాండ్ గా ప్రారంభమైంది. ఇప్పటికే కిరణ్ రాథోడ్ హౌజ్ ను వీడిన విషయం తెలిసిందే. నెక్ట్స్ హౌజ్ నుంచి వెళ్లిపోయే సమయం రానే వస్తోంది. 

Read more Articles on