Bigg Boss Telugu : ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్... డేంజర్ జోన్లో ఆ కంటెస్టెంట్!

బిగ్ బాస్ తెలుగు 7లో మరో ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. ఓటింగ్ మరో రోజులో ముగియనుంది. ఇప్పటి వరకు ఓటింగ్ చూసుకుంటే రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం...
 

bigg boss telugu 7 shocking voting results this contestant in danger zone ksr

బిగ్ బాస్ తెలుగు 7 ఐదో వారంలో అడుగుపెట్టింది. 14 మంది సెలెబ్రిటీలతో షో మొదలు కాగా నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఈ నలుగురు ఆడవాళ్లు కావడం విశేషం. రతికా రోజ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయ్యారు. టాప్ కంటెస్టెంట్ అనుకున్న రతికా రోజ్ అనూహ్యంగా నాలుగో వారమే సర్దింది. ఆమె మాట తీరు, ప్రవర్తన నచ్చని ప్రేక్షకులు గుడ్ బై చెప్పారు. 

ఇక హౌస్ ని వీడే ఐదవ కంటెస్టెంట్ ఎవరనే చర్చ మొదలైంది. పవర్ అస్త్ర గెలిచిన సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ నుండి మినహాయింపు పొందారు. మిగిలిన అమర్ దీప్, శివాజీ, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, తేజా నామినేట్ అయ్యారు. ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ పరిశీలిస్తే... శివాజీ టాప్ లో ఉన్నారని సమాచారం. అతని తర్వాత స్థానంలో ప్రిన్స్ యావర్ ఉన్నాడు. 

Latest Videos

అమర్ దీప్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడట. శుభశ్రీ నాలుగు, ప్రియాంక ఐదవ స్థానాల్లో ఉన్నారట. చివరి రెండు స్థానాల్లో గౌతమ్ కృష్ణ, తేజా ఉన్నట్లు సమాచారం. గౌతమ్ కృష్ణ, తేజాకి మధ్య ఓటింగ్ లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ వారం టేస్టీ తేజా ఎలిమినేట్ కావచ్చని అంటున్నారు. గత వారం కూడా తేజా ఓటింగ్ లో వెనుకబడిన సంగతి తెలిసిందే...  

కాగా ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వెళ్లనున్నారట. ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదే అంటున్నారు. అక్టోబర్ 8 ఆదివారం మరో లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ ద్వారా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ని ఇంట్లోకి పంపనున్నారట. గతంలో ఎన్నడూ చేయని ఈ ప్రయోగం ప్రేక్షకులకు కిక్ ఇవ్వనుందని అంటున్నారు. 

జబర్దస్త్ కెవ్వు కార్తీక్ అట. అలాగే సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షామిలి, సీరియల్ నటి అంజలి పవన్, సీరియల్ నటి నయని పావని అంటున్నారు. ఈ కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెడుతున్నారనేది తాజా సమాచారం. 
 

vuukle one pixel image
click me!