Bigg Boss Telugu 7: షటప్... యూ షటప్ అంటూ గొడవకు దిగిన కొత్త భామలు!

By Sambi Reddy  |  First Published Oct 13, 2023, 6:20 PM IST


కొత్తగా హౌస్లో అడుగుపెట్టిన పూజా మూర్తి-అశ్వినిశ్రీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరిపై మరొకరు ఫైర్ అయ్యారు. 
 


నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ టాస్క్స్ నిర్వహిస్తున్నాడు. ఇందుకు ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన కొత్త వాళ్లతో పాటు గౌతమ్ ని కలిపి ఒక టీమ్ గా నిర్ణయించాడు. ఈ టీమ్ కి పోటుగాళ్ళు అని పేరు పెట్టాడు. పాత ఇంటి సభ్యులను ఆటగాళ్లు అనే టీమ్ చేశాడు. ఆరు టాస్కుల్లో చెరో మూడు టాస్క్స్ గెలిచారు. నిర్ణయాత్మక ఏడో టాస్క్ ఫిజికల్ ఇచ్చారు. ఇరు టీమ్స్ సభ్యులు గార్డెన్ ఏరియాలో రగ్బీ తరహా గేమ్ ఆడాలి. సిద్ధంగా ఉన్న రెండు టీమ్స్ బజర్ మోగిన వెంటనే మధ్యలో ఉన్న బంతిని తీసుకుపోయి ఒక బాస్కెట్ లో వేయాలి. ఈ టాస్క్ లో గెలిచిన టీం సభ్యుడు ఒకరు కెప్టెన్ అవుతారు. 

అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం ప్రిన్స్ యావర్ సెకండ్ కెప్టెన్ గా అవతరించాడట. దీంతో శివాజీ శిష్యులు దుమ్మురేపుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. శివాజీకి ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ప్రియ శిష్యులు. పల్లవి ప్రశాంత్ కెప్టెన్ కావడంతో శివాజీ కృషి ఉంది. వరుసగా తనకు ఇష్టమైన వ్యక్తి కెప్టెన్ అయినట్లు అవుతుంది. 

Latest Videos

కాగా ఈ టాస్క్ ముగిశాక అశ్విని శ్రీ-పూజా మూర్తి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేను స్ట్రాంగ్ అని పూజ మూర్తి చెబుతుంటే, నేను స్ట్రాంగ్ అని నీకు అనిపించలేదా అని అశ్విని శ్రీ కౌంటర్ వేసింది. ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అని పూజా మూర్తి అనగా... నీకు నోరెక్కువని అందరికీ తెలిసిపోయిందిలే అని అశ్వినీశ్రీ అన్నది. దాంతో చిర్రెత్తుకొచ్చిన పూజా మూర్తి షటప్ అంది. దాంతో అశ్వినిశ్రీ యూ షటప్ అంటూ ఫైర్ అయ్యింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

ఇక ఎలిమినేషన్స్ లో ఏడుగురు ఉండగా....  అందరికంటే టాప్ లో యావర్ దూసుకుపోతున్నాడట. అతడికి ముప్పై శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. ప్రిన్స్ తర్వాత రెండో స్థానంలో అమర్ దీప్ కొనసాగుతున్నాడు. అతడికి ఇరవై శాతం ఓట్ల వరకు వచ్చాయి. మూడో స్థానంలో టేస్టీ తేజా, నాలుగో స్థానంలో అశ్విని శ్రీ, ఐదో స్థానంలో నయని పావని ఉన్నారట. చివరి రెండు స్థానాల్లో పూజా మూర్తి, శోభా శెట్టి ఉన్నట్లు సమాచారం. వైల్డ్ కార్డు ఎంట్రీల కంటే కూడా తక్కువ ఓట్లు తెచ్చుకున్న శోభా శెట్టి లీస్ట్ లో ఉన్నారట. పూజా-శోభా మధ్య ఒక శాతం ఓటింగ్ తేడా ఉందట. మరి ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే శోభా శెట్టి ఇంటికి పోవడం ఖాయం అంటున్నారు.

Bigg Boss Contestants face their next challenge: Who's the Best? Stay tuned to see who shines in the spotlight! 🌟🔥 https://t.co/U8jKcsQBzu

— Starmaa (@StarMaa)
click me!