వరలక్ష్మి శరత్ కుమార్ నటన పై ఆసక్తికర కామెంట్స్ చేసిన బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్

Published : Apr 14, 2024, 07:56 PM IST
వరలక్ష్మి శరత్ కుమార్ నటన పై ఆసక్తికర కామెంట్స్ చేసిన బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్

సారాంశం

నేను చూసిన వరలక్ష్మి గారి మొదటి సినిమా ' తారై తప్పటి '. ఆ సినిమా చూశాక ఏ హీరోయిన్ అయినా సరే ఇటువంటి పర్ఫార్మెన్స్ చేస్తారా అని అనుకున్న. నేను ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. 

సీరియల్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి నటి వరలక్ష్మి శరత్ కుమార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న' శబరి ' మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మే 3న విడుదల కానుంది. కాగా దీనికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అమర్ దీప్ చౌదరి పాల్గొన్నారు. ఆ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ గురించి అమర్ దీప్ మాట్లాడాడు. 

 

అమర్ మాట్లాడుతూ .. ' మా కాలేజ్ డేస్ లో వరుణ్ సందేశ్ అన్న అంటే గుర్తొచ్చేది ' హ్యాపీ డేస్ ',' కొత్త బంగారు లోకం ' సినిమాలు గుర్తొస్తాయి. శశాంక్ అన్న అంటే ' సై ' సినిమా గుర్తుకు వస్తుంది. ఇక ఫణి గారి కామెడీ టైమింగ్ అదిరిపోతుంది' అని అమర్ అన్నాడు. నేను చూసిన వరలక్ష్మి గారి మొదటి సినిమా ' తారై తప్పటి '. ఆ సినిమా చూశాక ఏ హీరోయిన్ అయినా సరే ఇటువంటి పర్ఫార్మెన్స్ చేస్తారా అని అనుకున్న. నేను ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. 

 

అలా ఉంటుంది ఆమె నటన. ఆవిడ నటించిన ' శబరి ' పెద్ద హిట్ కావాలి అని కోరుకుంటున్నాను. నిర్మాత మహేంద్రనాథ్ గారిది గోల్డెన్ హార్ట్. ఇలా అందరూ చెబుతారు కానీ ఒకసారి ఆయనతో ట్రావెల్ చేసి చూస్తే తెలుస్తుంది. హడావిడిగా ఏది చేయరు. ప్రతీది చక్కగా చేసేంత వరకు టైం ఇస్తారు. ' శబరి ' టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను అని అమర్ మాట్లాడారు. 

 

హీరో వరుణ్ సందేశ్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. అమర్ విషయానికి వస్తే సీరియల్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా మారాడు. త్వరలోనే అమర్ హీరోగా నటిస్తున్న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఇది షూటింగ్ జరుపుకుంటుంది. 

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా