టిట్ ఫర్ ట్యాట్.. ఇకపై నిన్ను అక్కే అంటా, రతికకు రైతుబిడ్డ ఝలక్!

రీఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్ రెండు రోజులు సైలెంట్ గా తన గేమ్ స్టార్ట్ చేసిన సూచనలు కనిపిస్తున్నాయి. యావర్ ఆల్రెడీ తన ట్రాప్ లో పడిపోగా ప్రశాంత్ మాత్రం ఝలక్ ఇచ్చాడు. 
 


రతిక రోజ్ ఈ సీజన్ కి మోస్ట్ కన్నింగ్ ప్లేయర్ గా పేరు తెచ్చుకుంది. ఫస్ట్ వీక్ నుండే ఆమె కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేసింది. ఈ హౌస్లో నీ హృదయం ఎవరికి ఇస్తావంటూ పల్లవి ప్రశాంత్ ని గెలికింది. ఇది పెద్ద ప్రశ్నే అన్న ప్రశాంత్... నీ హృదయం ఎవరికి ఇస్తావని అడిగాడు. నీకే అంటూ రతిక అతడిని రెచ్చగొట్టింది. ట్రాప్ లో పడ్డ ప్రశాంత్ ట్రాక్ తప్పాడు. అయితే రతిక తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు తీయడంతో డిస్టెన్స్ మైంటైన్ చేశాడు. 

యావర్ ని కూడా ఇలానే బుట్టలో వేసుకుంది. అయితే ఆమె ఆటలో నిజాయితీ లేదు. ఇతరులను వాడుకొని గేమ్ ఆడాలనుకుంటుందని జనాలు పసిగట్టి ఇంటికి పంపారు. బిగ్ బాస్ టీమ్ హెల్ప్ చేయడంతో శుభశ్రీ, దామిని కాకుండా రతికకు ఛాన్స్ దక్కింది. వచ్చిన రెండు రోజులు సైలెంట్ గా ఉంది. మరలా తన అన్ ఫెయిర్ గేమ్ స్టార్ట్ చేసింది. యావర్ ఆమె మాయలో పడిపోయాడు. రతికతో ఉంటూ ఆమె పనులు కూడా చేస్తున్నాడు. 

Latest Videos

అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం జాగ్రత్తగా వహిస్తున్నాడు. వచ్చిన రోజు వెల్కమ్ చెప్పిన ప్రశాంత్ తర్వాత డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నాడు. రతికను నన్ను అక్క అని పిలవొద్దని ప్రశాంత్ తో అంది. నేను అదే అంటాను. ఒకసారి నేను ఫిక్స్ అయితే అంతే. మనం ఫ్రెండ్స్ గా ఉందాము అక్క అని పిలవద్దు అని రతిక కోరింది. లేదు నేను నిన్ను అక్కే అంటాను అన్నాడు. రతిక, యావర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రశాంత్ వినలేదు. 

ప్రశాంత్ కరెక్ట్ ట్రాక్ లో వెళుతున్నాడని అర్థం అవుతుంది. పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్ అయిన యావర్ కూడా ఆమెకు దూరంగా ఉంటే మంచిదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె గేమ్ బయట చూసొచ్చి మరిన్ని నాటకాలు ఆడుతుందని ఆడియన్స్ అభిప్రాయం. ఏది ఏమైనా హౌస్లో నిజాయితీగా ఉన్నవాళ్లే చివరి వరకూ ఉంటారు. 
 

click me!