ఇటలీ బయలుదేరిన వరుణ్‌ తేజ్‌- లావణ్య జంట.. ఎయిర్‌పోర్ట్ లో లావణ్య చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఇటలీ బయలు దేరారు. అక్కడ గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నారు. తాజాగా ఎయిర్‌ పోర్ట్ లో సందడి చేసిందీ జంట. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ లో మెరిశారు. 


మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి మరో నాలుగు రోజుల్లో ఒక్కటి కాబోతున్నారు. ఐదేళ్ల ప్రేమకి పెళ్లితో ముగింపు పలకబోతున్నారు. `మిస్టర్‌` చిత్రంతో ప్రారంభమైన ఈ జంట ప్రేమ కథ ఎట్టకేలకు శుభం కార్డ్ పడబోతుంది. ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నారు. దీంతో వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఇటలీ బయలు దేరారు. అక్కడ గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నారు. 

తాజాగా ఎయిర్‌ పోర్ట్ లో సందడి చేసిందీ జంట. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ లో మెరిశారు. వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి మొదటగా ఇటలీ బయలు దేరడం విశేషం. ఈ సందర్భంగా లావణ్య ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. ఎయిర్‌ పోర్ట్ లో తను చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. ఆమె కారు నుంచి దిగాక అక్కడ ఉన్న వ్యక్తికి మనీ(టిప్పు) ఇచ్చింది. దీంతో అతను ఆనందంలో మునిగిపోయారు. ఆయన ముఖంలో ఆనందం చూసిన లావణ్య సైతం చిరు నవ్వుతో అక్కడి నుంచి బయలు దేరింది. ఇద్దరు కలిసి ఎయిర్‌ పోర్ట్ లోపలికి వెళ్లారు.
 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఇందులో లావణ్య చేసిన పనికి అంతా వాహ్‌ అంటున్నారు. తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు త్వరలో రాబోతున్న నేపథ్యంలో ఆమె ఆనందంలో ఈ పని చేసి ఉంటుందని, ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. లావణ్య హ్యాపీనెస్‌కిది నిదర్శనం అంటున్నారు. 

Latest Videos

ఇక నవంబర్‌ 1న ఇటలీలో వరుణ్‌లవ్‌ మ్యారేజ్‌ జరగబోతుంది. దీనికి మెగా ఫ్యామిలీ, అతికొద్ది మంది సినీ ప్రముఖులు, బంధువులు హాజరవుతారని తెలుస్తుంది. అయితే నవంబర్‌ 5న హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వేన్షన్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ప్లాన్‌ చేశారు. దానికి సంబంధించిన ఇన్విటేషన్‌ కార్డ్ నెట్టింట వైరల్‌ అవుతుంది. 
 

click me!